Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితి, భారత్‌లోని మైనారిటీల పరిస్థితి ఒకేలా ఉందని, రెండు దేశాల మధ్య భేదం లేదని ఆమె అన్నారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ ముఫ్తీ ప్రకటనను పలువురు బీజేపీ నేతలు ఖండించారు. ఆమె వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమని చెప్పారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని కోరారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని, భారత్ లోనూ మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతుంటే, భారత్ బంగ్లాదేశ్‌కి తేడా ఏంటి..? ఈ రెండు దేశాల మధ్య నాకు ఎలాంటి తేడా కనిపించడం లేదని పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో ముఫ్తీ అన్నారు. మనకు ఇంత గొప్ప దేశం ఉందని, సెక్యులర్ స్వభావంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని ఆమె అన్నారు.
Read Also: S Jaishankar: ‘‘టిప్పు సుల్తాన్ చరిత్ర చాలా క్లిష్టమైన వ్యక్తి’’.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
బంగ్లాదేశ్‌లో హిందూ మతగురువు చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టుపై నిరసనలు జరుగుతున్న వేళ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ పరిస్థిని భారత్‌తో పోల్చడం పూర్తిగా ఖండిచదగినందని, బంగ్లాదేశ్‌లో అత్యంత దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రపంచానికి తెలుసు, ఇక్కడ మైనారిటీ సమాజం లక్ష్యంగా దాడులు, మహిళల అవమానాల గురించి ప్రపంచానికి తెలుసని జమ్మూ కాశ్మీర్ మాజీ బీజేపీ చీఫ్ రవిందర్ రైనా అన్నారు. ఎన్నికైన ప్రధాని దేశం విడిచి పారిపోయేటట్లు చేయడం, ఆ దేశ జాతిపతను అగౌరపరడంపై ఆయన మాట్లాడారు.
జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఓపి) సునీల్ శర్మ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తర్వాత మెహబూబా ముఫ్తీ తన పార్టీని పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నమని అన్నారు. పీడీపీ పూర్తిగా మునిగిపోయింది, మెహబూబా తన పార్టీని మళ్లీ స్థాపించేందుకు ముస్లింలను రెచ్కచగొట్టడానికి ఇలాంటి ప్రకటన చేస్తోందని ఆయన ఆరోపించారు. సంభాల్ మసీదు సర్వే సమయంలో జరిగిన హింస గురించి ముఫ్తీ మాట్లాడుతూ.. కొందరు షాపుల్లో పనిచేసే వారిని చంపేశారని అన్నారు. 1947 నాటి పరిస్థితులు వస్తున్నాయని ఆమె కామెంట్స్ చేశారు.