NTV Telugu Site icon

Acharya Pramod: కాంగ్రెస్ నుంచి ఆచార్య ప్రమోద్ బహిష్కరణ.. ‘‘రాముడి విషయంలో రాజీ లేదని రిఫ్లై‘‘

Acharya Pramod

Acharya Pramod

Acharya Pramod: కీలక కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణంని పార్టీ నుంచి బహిష్కరించారు. క్రమశిక్షణారాహిత్యం ఆరోపణల కారణంగా అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై లక్నో నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆచార్య కృష్ణం ఇటీవలే అయోధ్యలో జరిగిన రామమందిర ప్రతిష్ఠాపన వేడుకపై ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించినందుకు కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా విమర్శించారు. క్రైస్తవులు, ముస్లింలు కూడా రామ మందిర ఆహ్వానాన్ని తిరస్కరించలేదు, రాముడు లేకుండా భారతదేశాన్ని ఉహించలేమని ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు.

Read Also: Farmers Protest : రెండు వేల ట్రాక్టర్లపై 20వేల మంది రైతులు.. మోడీ ఇంటి ముట్టడికి ప్లాన్

పార్టీకి వ్యతిరేకంగా, క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తిస్తున్న కారణంగా అతడిని బహిష్కరించాలని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఇటీవల ఆయన ప్రధాని మోడీని కూడా కలివారు. ఫిబ్రవరి 19న ఉత్తర్ ప్రదేశ్ సంభాల్‌లో శ్రీ కల్కి ధామ్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు.

ఇదిలా ఉంటే, ఆచార్య ప్రమోద్ తనను కాంగ్రెస్ బహిష్కరించడంపై ఎక్స్(ట్విట్టర్)వేదికగా స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ.. ‘‘రాముడు, దేశం విషయంలో రాజీ పడేది లేదు’’ అని రాశారు. పరోక్షంగా మరోసారి కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు దిగారు. కాంగ్రెస్ బహిష్కరణ తర్వాత అతను బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.

Show comments