Site icon NTV Telugu

Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు మరోసారి బెయిల్ నిరాకరణ..

Manish Sisodia

Manish Sisodia

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీస్ సిసోడియాకు మరోసారి చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్, అవినీతికి పాల్పడినట్లు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా అభియోగాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వ్యతిరేకించింది. దర్యాప్తు కీలక దశలో ఉందని కోర్టుకు విన్నవించింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ అవినీతి కేసులో సిసోడియాకు మార్చి 31న బెయిల్ తిరస్కరించింది న్యాయస్థానం. ఈ మొత్తం స్కామ్ లో దాదాపుగా రూ. 90-100 కోట్లు కిక్ బ్యాక్ తీసుకునే కుట్రలో సిసోడియా కీలక నిందితుడిగా ఉన్నాడని కేంద్ర ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి.

Read Also: Supreme Court: హంతకులకు ఎలా తెలిసింది..? అతిక్ అహ్మద్ హత్య కేసులో యూపీ ప్రభుత్వానికి ప్రశ్నలు..

అంతకుముందు రోజు గురువారం సిసోడియా కస్టడీని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు పొడగించింది. మే 12 వరకు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కేసు దర్యాప్తు పురగతివలో ఉందని రిమాండ్ పొడగించాల్సిందిగా సీబీఐ చేసిన అభ్యర్థను కోర్టు అంగీకరించింది. ఈ కేసులో ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశార. ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు.

ఢిల్లీ లిక్కర్ కేసులో సిసోడియానే కీలకంగా వ్యవహరించారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో సౌత్ గ్రూప్ కు చెందిన పలువురు అరెస్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే గత వారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా సీబీఐ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో ఇదంతా బూటకపు కేసు అని, అసలు లిక్కర్ స్కామే జరగలేదని ఆప్ పార్టీ ఆరోపిస్తోంది. కావాలనే బీజేపీ కేంద్ర సంస్థల్ని ఉపయోగించి ప్రతిపక్షాలను వేధిస్తున్నాయంటూ మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు.

Exit mobile version