Sanjay Raut: త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి సంజయ్ రౌత్..?.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!
- మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
- త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి సంజయ్ రౌత్..?
- కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని నితీశ్ రాణే ఆరోపించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణే శివసేన(యూబీటీ)సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నాడని వెల్లడించాడు. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఢిల్లీలోని ఓ నాయకుడితో చర్చలు జరుపుతున్నారని నితీశ్ రాణే ఆరోపించారు. సంజయ్ రౌత్ రాజ్యసభ పదవి కాలం ముగిసే సమయం ఆసన్నమైంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీకి ఆయనను మరో దఫా గెలిపించేంత మంది ఎమ్మెల్యేలు లేరని నితీష్ రాణే అన్నారు.
నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ 20 స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది. ఇక పార్టీ భవిష్యత్తు గురించి అర్థం చేసుకున్న సంజయ్ రౌత్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు అని మంత్రి నితీశ్ రాణే ఆరోపించారు. రౌత్ ఇంకా ఎంతకాలం శివసేనలో కొనసాగుతారు..?కాంగ్రెస్‌లో చేరేందుకు దిల్లీలో చర్చలు జరుపుతున్న నేత గురించి ‘సామ్నా’లో రాయాలి. సంజయ్ రౌత్ కూడా తన ఉద్దేశాన్ని అధికారికంగా ప్రకటించాలి, కాంగ్రెస్ కూడా ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి, శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే మధ్య విభేదాల కారణంగా రాష్ట్రంలో పాలన దెబ్బతింటోందని సంజయ్ రౌత్ ఇటీవల పేర్కొన్నాడు. షిండే సీఎం పదవి కోసం పోరాడుతున్నారని ఈ విషయంపై ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయంటూ ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రజలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఇటీవల సామ్నాలో సంజయ్ పేర్కొన్నారు. దీనిపై తాజాగా స్పందించిన మంత్రి నితీశ్ రాణే సంజయ్ రౌత్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!