NTV Telugu Site icon

Nitish Kumar: “వన్ నేషన్-వన్ ఎలక్షన్‌”కి నితీష్ పార్టీ మద్దతు.. అగ్నిపథ్‌ స్కీమ్‌ని మాత్రం..

Modi

Modi

Nitish Kumar: కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఈ నెల 9న ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే, గత రెండు పర్యాయాలుగా కాకుండా, ఈ సారి బీజేపీ ఎన్డీయే మిత్రపక్షాలైన జేడీయూ, తెలుగుదేశం, శివసేనలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. తాజా ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 543 సీట్లకు గానూ 292 గెలుచుకుంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272కి తక్కువగా 240 సీట్లను సాధించింది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.

Read Also: RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారాన్ని స్వదేశానికి ఎందుకు తీసుకువస్తుంది..?

బీజేపీ లక్ష్యాలుగా ఉన్న యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ), వన్ నేషన్-వన్ ఎలక్షన్ వంటి వాటి అమలుపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అయితే, ఇప్పటికే జేడీయూ యూసీసీకి మద్దతు ఇచ్చినట్లు తెలస్తోంది. అయితే సైన్యం కోసం తీసుకువచ్చిన ‘‘ అగ్నిపథ్’’ స్కీమును సమీక్షించాలని కోరుతోంది. ఇప్పటికే జేడీయూ నేత కేసీ త్యాగి మాట్లాడుతూ, అగ్నిపథ్ పథకంపై ఆగ్రహం ఉందని, ఇది ఎన్నికల్లో కనిపించిందని చెప్పారు. అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టిన సమయంలో సాయుధ దళాల్లో పెద్ద వర్గం అసంతృప్తి వ్యక్తం చేసిందని, వారి కుటుంబాలు నిరసన వ్యక్తం చేశాయని, దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. జేడీయూ వన్ నేషన్ వన్ ఎలక్షన్, సివిల్ కోడ్‌కి అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

సాయుధ బలగాలను సన్నద్ధం చేయడానికి రక్షణ వ్యయాన్ని తగ్గించేందుకు కేంద్రం 2022లో అగ్నిపథ్ స్కీమ్ తెచ్చింది. ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్‌లో నాలుగు సంవత్సరాల స్వల్పకాలిక ఒప్పందంపై సిబ్బందిని నియమిస్తారు. ఇందులో శాశ్వతంగా 15 ఏళ్లు కొనసాగడానికి 25 శాతం మంది మాత్రమే అనుమతించబడతారు. ఈ పథకం బీహార్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానాల్లో భారీ నిరసనలకు కారణమైంది.