Site icon NTV Telugu

Amit Shah: బీహార్‌లో బీజేపీని గెలిపించండి.. అల్లరి మూకలను తలకిందులుగా వేలాడదీస్తాం

Amit Shah

Amit Shah

Amit Shah: సీఎం నితీష్ కుమార్ అధికార దాహం వల్లే లాలా ప్రసాద్ యాదవ్ ఒడిలో కూర్చున్నారని విమర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీహార్ నవడాలో పర్యటించిన ఆయన జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ మహాఘటబంధన్ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఆదివారం నవడా జిల్లాలోని హిసువా ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. బీహార్ లో రామనవమి రోజుల చెలరేగిన మతఘర్షణల గురించి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జంగిల్ రాజ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో ఉన్న ప్రభుత్వం బీహార్ లో శాంతిని నెలకొల్పుతుందా..? అని ప్రశ్నించారు.

Read Also: SRH vs RR: 10 ఓవర్లలో రాజస్థాన్ స్కోర్ ఇది.. తాండవం చేసిన ఓపెనర్స్

నేను ససారం వెళ్లాల్సి ఉంది, అయితే దురదృష్టవశాత్తు అక్కడ మతఘర్షణలు చెలరేగాయి. ప్రజలు చంపబడుతున్నారు, బుల్లెట్ల కాల్పలు, టియర్ గ్యాస్ షెల్లింగ్ జరుగుతున్నాయని అమిత్ షా అన్నారు. జేడీయూ నేతలకు ఎన్డీయే తలుపులు మూసుకుపోయాయని ఆయన జేడీయూతో ఇకపై బంధం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ తప్పుడు ఆశలతో జీవిస్తున్నారని, నితీష్ కుమార్ ప్రధాని కలలు నెరవేరవు అని అమిత్ షా అన్నారు. లాలూ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్ లో జంగిల్ రాజ్ తిరిగి వచ్చిందని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిరాన్ని కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, టీఎంసీ వ్యతిరేకించాయని, కానీ మోదీ అక్కడ ఆకాశమంత ఎతైన ఆలయాన్ని నిర్మిస్తున్నారని అన్నారు.

ససారం, బీహార్ షరీఫ్ పట్టణాల్లో మత హింసను అరికట్టడంలో బీహార్ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. 2025లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే అల్లరిమూకలను తలకిందులుగా వేలాడదీస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. బీహార్ లో చెలరేగిన మతఘర్షణలు సమసిపోవాలని కోరారు. అంతకుముందు ససారం వెళ్లాల్సిన అమిత్ షా, మతఘర్షణల కారణంగా అక్కడ 144 సెక్షన్ విధించడం వల్ల ఆయన పర్యటన రద్దు అయింది.

Exit mobile version