Rajasthan Royals Score In First 10 Overs: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలుత టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోగా.. బ్యాటింగ్ చేసేందుకు రాజస్థాన్ రంగంలోకి దిగింది. యశస్వీ జైస్వాల్, రాస్ బట్లర్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. వీళ్లిద్దరు మైదానంలో అడుగుపెట్టినప్పటి నుంచి.. ఒకటే బాదుడు బాదేశారు. ఒకవైపు యశస్వీ ఫోర్ల మీద ఫోర్లు కొడుతుంటే.. మరోవైపు బట్లర్ సిక్స్‌ల వర్షం కురిపించాడు. ప్రత్యర్థులు ఎలాంటి బంతులు వేసినా.. వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని, పరుగుల వర్షం కురిపించారు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలోనే బట్లర్ అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వీళ్లిద్దరు కలిసి 5.4 ఓవర్లలోనే తొలి వికెట్‌కి 85 పరుగులు జోడించారు. దీన్ని బట్టి.. వీళ్లు ఏ రేంజ్‌లో ప్రత్యర్థి బౌలర్లపై తాండవం చేశారో అర్థం చేసుకోవచ్చు.
Kane Williamson: కేన్ విలియమ్సన్‌పై గుజరాత్ టైటాన్స్ బాంబ్.. ఆ భయమే నిజమైంది!
అయితే.. ఫజల్‌హఖ్ ఫారుఖీ వీరి జోడికి బ్రేక్ వేశాడు. 5.5 వద్ద జాస్ బట్లర్‌ని అతడు ఔట్ చేశాడు. దాంతో.. రాజస్థాన్ జోరు కాస్త నెమ్మదించినట్టయ్యింది. అతడు ఔటయ్యాక సంజూ శాంసన్ బరిలోకి దిగాడు. ఇతడు వచ్చాక కాస్త కుదురుకోవడానికి టైం తీసుకున్నాడు. అటు యశస్వీ కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టారు. దీంతో.. 10 ఓవర్లలోనే రాజస్థాన్ స్కోరు 122 పరుగులకి చేరుకుంది. మొదటి తొలి 10 ఓవర్లలో ఫారుఖీ ఒక్కడే ఒక వికెట్ తీయగా.. మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఏ ఒక్కరు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ వేయలేకపోయారు.