Nitish Kumar Bihar Strategy: బీహార్‌ను విడిచేది లేదు.. సర్కార్‌పై ఓ కన్నేసి ఉంచుతా..! నితీష్‌కుమార్ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar Bihar Strategy: బీహార్ రాజకీయాల్లో సంచలనం రేపేలా జేడీయూ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “నేను బీహార్‌ను విడిచిపెట్టను… ప్రభుత్వంపై కన్నేసి ఉంచుతాను” అని ఆయన స్పష్టం చేయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లినా, బీహార్ రాజకీయాలపై తన పట్టు మాత్రం సడలించబోనని నితీష్ సంకేతాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత సమ్రాట్ చౌదరి కొత్త నాయకత్వంగా ఎదిగారు. అయితే అధికార బాధ్యతలు మారినా, రాజకీయ ప్రభావం మాత్రం ఇంకా నితీష్‌కే ఉందని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. పాట్నాలో జరిగిన జేడీయూ శాసనసభ పక్ష సమావేశంలో పార్టీ నేతలు నితీష్‌కే పూర్తి అధికారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Read Also: Phone Snatching: హైదరాబాద్‌లో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇక, సమావేశం అనంతరం నితీష్ కుమార్ మాట్లాడుతూ, తాను బీహార్లోనే ఎక్కువ సమయం గడుపుతానని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలు, ప్రజలతో నేరుగా మమేకమవుతానని తెలిపారు. పార్టీలో ఎలాంటి గందరగోళం లేదని, అంతా సాధారణంగానే ఉందని ఆయన చెప్పడం ద్వారా జేడీయూలో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటిచెప్పారు. అయితే, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ముఖ్యమంత్రి పదవి వదిలినా నితీష్ కుమార్ అసలు లక్ష్యం జేడీయూ సంస్థను మరింత బలోపేతం చేయడమే. ప్రభుత్వ యంత్రాంగ బాధ్యతల నుంచి విముక్తి పొందిన ఆయన, ఇప్పుడు పార్టీ పునాదులను బలపరచడంపై దృష్టి సారించనున్నారని అంటున్నారు. అదే సమయంలో సమ్రాట్ చౌదరి ప్రభుత్వ పనితీరుపై కూడా పర్యవేక్షణ కొనసాగించనున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
బీహార్‌లో విస్తృత పర్యటన చేపట్టనున్న నితీష్ కుమార్, జిల్లాల వారీగా ప్రజాభిప్రాయాలను తెలుసుకుని కొత్త సంస్థాగత చట్రం సిద్ధం చేయాలని చూస్తున్నారు. ఇది అధికారిక ప్రభుత్వ పర్యటన కాకుండా, పూర్తిగా రాజకీయ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమంగా భావిస్తున్నారు. క్షేత్రస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసి రాబోయే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ఇక, మరో కీలక అంశం ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ ప్రవేశమే. ఇప్పటికే నిశాంత్ బీహార్‌లో వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పాట్నాలోని పార్టీ కార్యాలయంలో కూడా ఆయన చురుకుగా వ్యవహరిస్తున్నారు. దీంతో నితీష్ కుమార్ తన వారసత్వ రాజకీయాలకు బాటలు వేస్తున్నారా అనే చర్చ మొదలైంది.
రాజకీయంగా చూస్తే, నితీష్ కుమార్ ఇప్పుడు ద్వంద్వ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు జేడీయూ బలహీనపడకుండా కాపాడుకోవడం, మరోవైపు తన కుమారుడు నిశాంత్‌కు భవిష్యత్ నాయకత్వానికి పునాది వేయడం ఆయన లక్ష్యంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఢిల్లీ కంటే పాట్నా, బీహార్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. మొత్తానికి, అధికార పదవి నుంచి తప్పుకున్నా బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ పాత్ర ముగియలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇకపై ఆయన ప్రత్యక్ష అధికారంలో కాకపోయినా, పరోక్షంగా బీహార్ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా కొనసాగనున్నారని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!