NTV Telugu Site icon

Nitish Kumar: నితీష్ కుమార్ నేతృత్వంలోనే బీహార్ ఎన్నికలు..క్లారిటీ ఇచ్చిన ఎన్డీయే..

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే జరుగుతాయని ఎన్డీయే శుక్రవారం క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో నితీష్ కుమార్‌ని తమ నాయకుడిగా ప్రకటించే అవకాశం లేదని వస్తున్న ఊహాగానాలపై ఈ రోజు స్పష్టత వచ్చింది. బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు సమావేశమయ్యారు. అట్టడుగు స్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం చేయడానికి ఈ సమావేశం జరిగింది. బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వం చాలా కాలంగా కొనసాగుతోంది, దీని నుంచి వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదని అన్నారు.

Read Also: Medchal: జల్సాలకి అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్.. ఇద్దరు అరెస్ట్

ఇటీవల మహారాష్ట్రలో ఘన విజయం సాధించినట్లే బీహార్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్డీయే ఎన్నికలకు వెళ్తుందా..? అని ఓ వార్త సంస్థ ప్రశ్నించిన నేపథ్యంలో అమిత్ షా మాట్లాడుతూ.. “మేము కలిసి కూర్చుని నిర్ణయం తీసుకుంటాము. మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు తెలియజేస్తాము” అని బదులిచ్చారు. ఈ వ్యాఖ్యల నితీష్ కుమార్‌ని ఈసారి ఎన్డీయే నేతగా ప్రొజెక్ట్ చేయరనే ఊహాగానాలకు దారి తీసింది. బీహార్‌లో రెండు దశాబ్ధాలుగా ఎన్డీయేకి నితీష్ కుమార్ సారధ్యం వహిస్తున్నారు. మరోవైపు బీహార్ బీజేపీ చీఫ్ జైశ్వాల్ తీరుగానే LJP (RV) రాష్ట్ర అధ్యక్షుడు రాజు తివారీ మాట్లాడారు. నితీష్ కుమార్ నాయకత్వంలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే పోటీ చేస్తుందని చెప్పారు. జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ సింగ్ కుష్వాహా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.