NTV Telugu Site icon

Bihar Cabinet: నేడే బిహార్ మంత్రివర్గ విస్తరణ.. సింహభాగం ఆర్జేడీకే..!

Bihar Cabinet

Bihar Cabinet

Bihar Cabinet: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని, కూటమి మిత్రపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్‌కు అత్యధిక స్థానాలు రానున్నాయని పలు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్జేడీకి 16 కేబినెట్ సీట్లు, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు 11మందికి చోటు దక్కే అవకాశం ఉంటుందని తెలిపాయి. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరికి, జితిన్ రామ్ మాంఝీకి చెందిన హెచ్‌ఏఎం(హిందుస్తానీ అవామ్ మోర్చా) నుంచి ఒకరికి, మరో స్వతంత్ర సభ్యుడికి కూడా మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం ఉంది. బిహార్ కేబినెట్‌లో గరిష్టంగా 36 మంది మంత్రులు ఉండవచ్చు.

ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ వేడుక జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ ఆగస్టు 10న ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పార్టీ నుంచి గతంలో ఉన్న మంత్రుల్లో ఒకరిని మినహాయించి అందరినీ కొనసాగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మిత్రపక్షమైన ఆర్జేడీ నుంచి సీనియర్‌ నాయకులకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇల్లు, ఆర్థిక, పన్నులు, రోడ్డు నిర్మాణం వంటి ప్లం పోర్ట్‌ఫోలియోలు ఎటువైపు వెళ్తాయో ఇంకా తెలియరాలేదు. గత ప్రభుత్వంలో నితీష్ కుమార్ హోంశాఖను ఆయనే నిర్వహించారు.

Free Sanitary Products: మహిళలకు శానిటరీ ప్యాడ్లు ఉచితంగా అందిస్తున్న తొలిదేశం ఇదే..!!

మహాకూటమి ప్రభుత్వంలో తేజస్వీ యాదవ్‌కు ఆరోగ్యం, ఆర్థికం, రహదారుల నిర్మాణం వంటి శాఖలు అప్పగించవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ శాఖలు గతంలో బీజేపీకి సంబంధించిన నేతలు నిర్వహించారు. కొత్త ప్రభుత్వం వచ్చే వారం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఉంది.నితీష్ కుమార్ ఈ నెల ప్రారంభంలో బీజేపీ నుంచి విడిపోయి, ఆర్జేడీ,కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

2020 ఎన్నికల్లో తక్కువ సీట్లు రాగా.. బీజేపీతో కలిసి నితీష్‌కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. హోంమంత్రి అమిత్ షా తన పార్టీని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీతో పొత్తును రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శివసేన సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చివేసిన మహారాష్ట్ర మోడల్‌ను బీజేపీ పునరావృతం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన భావించినట్లు పలు వర్గాలు తెలిపాయి.