Nitish Kumar: కేబినెట్ రద్దుకు సిఫార్సు.. ముగిసిన నితీష్ కుమార్ శకం
- ముగిసిన నితీష్ కుమార్ శకం
- కేబినెట్ రద్దుకు నితీష్ కుమార్ సిఫార్సు
- ఈ సాయంత్రమే కొత్త సీఎం ఎంపిక
- రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో నితీష్ కుమార్ శకం ముగిసింది. రెండు దశాబ్దాలకు పైగా బీహార్ పరిపాలకుడిగా సాగిన ప్రయాణం నేటితో ముగిసింది. కేబినెట్‌ను రద్దు చేస్తూ నితీష్ కుమార్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఆమోదించగానే నితీష్ కుమార్ ప్రభుత్వం రద్దవుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది.
నితీష్ భావోద్వేగం..
కేబినెట్‌ను ఉద్దేశిస్తూ నితీష్ కుమార్ చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నేను చేయగలిగినంత చేశాను. 2005 నుంచి ఇప్పటి వరకు జరిగిన పదవీ కాలాన్ని గుర్తుచేశారు. తాను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీహార్ కోసం ఏం చేయాలో అదంతా చేశాను.’’ అని చెప్పుకొచ్చారు.
Also Read
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
- PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి నితీష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అభివృద్ధి పనులు కొనసాగాలని సూచించారు. మాట్లాడినంత సేపు మాటలు, హావభావాలు భావోద్వేగంతో కనిపించాయి. మంత్రులు, అధికారులు కూడా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఎంతో శ్రద్ధగా, గౌరవంగా విన్నారు.
పెద్దల సభకు..
అనూహ్యంగా గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నితీష్ కుమార్ పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఈనెల 10న రాజ్యసభ ఎంపీగా కూడా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆయన రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ వ్యక్తి రానున్నారు.
తాజావార్తలు
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!