Bihar Politics: లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు బలం మరింత పెరిగింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ పార్టీ, సీఎం నితీష్ కుమార్ వైదొలిగారు. రెండు రోజులుగా నెలకొన్న అనిశ్చితిపై ఈ రోజు క్లారిటీ వచ్చింది. ఆదివారం సీఎం నితీష్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్‌కి సమర్పించారు, సాయంత్రం 5 గంటలకు బీజేపీ మద్దతుతో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ఉండనున్నారు.
ఇదిలా ఉంటే నితీష్ నేతృత్వంలోని జేడీయూ, ఇండియా కూటమి, ఆర్జేడీపై సంచలన ఆరోపణలు చేసింది. బీహార్‌లో ఆర్జేడీతో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయకలేకపోవడం వల్లే నిర్ణయం తీసుకున్నట్లు నితీష్ కుమార్ చెప్పారు. పార్టీ సభ్యులతో సంప్రదింపులు జరిగిన తర్వాత సంకీర్ణం నుంచి వైదొలగాలని సలహాలు వచ్చాయని ఆయన అన్నారు. ఇక ఇండియా కూటమి పతానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని జేడీయూ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది.
Read Also: Bihar Politics: సీఎంగా నితీష్.. బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరు..
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసింది. సంకీర్ణ నాయకత్వాన్ని హైజాక్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగా ఆరోపించారు. కూటమిలో నాయకత్వంతో సం తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీతో కలిసి కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. ‘‘డిసెంబర్ 19న ఇండియా కూటమి కుట్ర ద్వారా మల్లికార్జున ఖర్గే పేరును(ప్రధానమంత్రి)గా ప్రకటించారు. ఒది కుట్రద్వారా, మమతా బెనర్జీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇతర పార్టీలు కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పోరాడి గుర్తింపు తెచ్చుకున్నాయి’’ అని త్యాగి అన్నారు. సీట్ల పంపకాల ప్రక్రియను కాంగ్రెస్ తప్పుగా వ్యవహరిస్తోందని, మిత్రపక్షాలపై అసమానమైన డిమాండ్లు చేస్తే ఇతర నాయకుల్ని అవమానాలకు గురిచేస్తోందని జేడీయూ ఆరోపించింది. కాంగ్రెస్ చర్యలు ఇండియా కూటమి ఐక్యతకు హానికరంగా ఉన్నాయని చెప్పింది. ఇక బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి కూటమి వద్ద ప్రణాళికలు లేవని కేసీ త్యాగి అన్నారు.
