Site icon NTV Telugu

Tejashwi Yadav: “క్షమించాలని” సీఎం నితీష్ కుమార్ లాలూని వేడుకున్నారు..

Tejashwi Yadav

Tejashwi Yadav

Tejashwi Yadav: జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ తమతో పొత్తు పెట్టుకోవడానికి లాలూ ప్రసాద్ యాదవ్‌ని క్షమించాలని కోరాడని ఆర్జేడీ నేత, లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ అన్నారు. 2022లో పొత్తు పెట్టుకోవడానికి ముందు లాలూను గత ద్రోహాన్ని మరిచి క్షమించాలని కోరాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నెలలో నితీష్ కుమార్ ఆర్జేడీ పొత్తును కాదని మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరాడు.

బీజేపీ తన పార్టీని చీర్చేందుకు, తన ఎమ్మెల్యేలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తోందని తన తల్లిదండ్రుల వల్ల నితీష్ కుమార్ క్షమాపణలు వేడుకున్నారని తేజస్వీ వెల్లడించారు. మొదట్లో ఆయనను నమ్మేందుకు మేము పెద్దగా మొగ్గు చూపలేదని, బీజేపీ వ్యతిరేకంగా పోరాటంలో కలిసి వస్తారని, దేశవ్యాప్తంగా పలు పార్టీలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నితీష్ కుమార్ సీఎంగా అలసిపోయారని అన్నారు. కేవలం తాను 17 నెలల్లోనే మా ప్రభుత్వంలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు, అందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు.

Read Also: Health Tips: నోటి పుండ్లు వస్తే టొమాటోలతో ఇలా చేయండి.. వెంటనే తగ్గిపోతుంది

ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, మీ నాన్న (లాలూ) డబ్బును వారికి జీతంగా ఇస్తావా.? అని నితీష్ కుమార్ ఎద్దేవా చేశారని, అయితే తాను మీ ప్రభుత్వానికి మా మద్దతు ఉందని, మేము ఇచ్చిన 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల వాగ్దానాన్ని నెరవేర్చడంలో మాకు సాయం చేయాలని చెప్పానని తేజస్వీ అన్నారు. బీహార్‌లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోందని, అయితే నితీష్ కుమార్ మాత్రం మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, మళ్లీ అతను ప్లేటు మార్చరనే గ్యారెంటీ లేదని విమర్శించారు. మా నుంచి నితీష్ కుమార్ ఎందుకు విడిపోతున్నారో అడిగామని, అందుకు ఆయన దగ్గర సమాధానం లేదని చెప్పారు. ఈడీలకు మేము భయపడేది లేదని అన్నారు.

Exit mobile version