Site icon NTV Telugu

Nitesh Rane: ‘‘జిహాదీ, హిందూ వ్యతిరేక ర్యాలీ’’.. ఠాక్రేలు పీఎఫ్ఐ, సిమి కన్నా తక్కువ కాదు..

Mahaeashtra

Mahaeashtra

Nitesh Rane: మరాఠీ భాషపై ఇద్దరు సోదరులు రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిసిపోయారు. 20 ఏళ్ల తర్వాత, ఒకే వేదికను పంచుకున్నారు. ఇకపై తాము కలిసి ఉంటామని స్పష్టం చేశారు. ప్రాథమిక పాఠశాల్లో త్రిభాషా విధానంలో భాగంగా హిందీని ప్రవేశపెట్టడాన్ని ఠాక్రే సోదరులు వ్యతిరేకించారు. మరాఠీలపై హిందీ రుద్దాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. అయితే, ఈ విధానంపై వ్యతిరేకత రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ తన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. అయితే, దీనిని విజయంగా భావిస్తూ ‘‘వాయిస్ ఆఫ్ మరాఠీ’’ కార్యక్రమంలో ఇద్దరు నేతలు కలుసుకున్నారు.

Read Also: Warangal: జిల్లా కాంగ్రెస్ నేతల వర్గ పోరుపై అధిష్టానం దృష్టి.. గాంధీభవన్‌కు రావాలని పిలుపు..

అయితే, ఈ కలయికపై బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి నితేష్ రాణే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది హిందువులను బలహీనపరిచే కుట్రగా అభివర్ణించారు. వీరిద్దరు నిర్వహించిన ర్యాలీ హిందూ వ్యతిరేకమని, ప్రజల్ని హిందువులు, మరాఠీలుగా విభజించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఠాక్రే సోదరుల ర్యాలీని జీహాది, హిందూ వ్యతిరేక ర్యాలీగా అభివర్ణించారు. ఇది సమాజాన్ని విభజిస్తుందని, రాష్ట్రాన్ని బలహీనపరుస్తుందని చెప్పారు.

శుక్రవారం మీడియాతో రాణే మాట్లాడుతూ.. ‘‘మేము హిందువులం, మరాఠీలుగా ఉండటం మాకు గర్వకారణం. జిహాదీలు మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించే విధానం. ఈ వ్యక్తులు కూడా ఇదే చేస్తున్నారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) లేదా సిమికి వీరు భిన్నంగా లేరు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాక్రేల ర్యాలీ హిందువులు ఎక్కువగా నష్టపోతారు, తర్వాత నల్ బజార్(ముస్లిం ఆధిపత్య ప్రాంతం)లో స్వీట్లు పంపిణీ చేయబడుతాయి.

Exit mobile version