Site icon NTV Telugu

Kerala: సీపీఎం నేత హత్య కేసులో 9 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు యావజ్జీవం..

Rijith Sankaran,

Rijith Sankaran,

Kerala: 2005లో కేరళలో సంచలనంగా మారిన సీపీఎం కార్యకర్త హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది 19 ఏళ్ల క్రితంత కన్నూర్ జిల్లాలో సీపీఎం కార్యకర్త రిజిత్ శంకరన్ హత్య కేసులో 9 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు తలస్సేరి కోర్టు జీవిత ఖైదు విధించింది. కన్నాపురం చుండాకు చెందిన 25 ఏళ్ల కార్యకర్త రజిత్‌ని 2005 అక్టోబరు 3న చుండాలోని ఓ దేవాలయం సమీపంలో దాడి చేసి చంపారు.

Read Also: BSNL Recharge: ఆలోచించిన ఆశాభంగం.. ఊహించని ధరకి 14 నెలల వ్యాలిడిటీ

రాజకీయంగా అస్థిరంగా ఉన్న కన్నూర్ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్, సీపీఎంల మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ హత్య జరిగింది. రిజిత్ తన స్నేహితులతో ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, ఆయుధాలతో ఆర్ఎస్ఎస్ బృందం దాడికి పాల్పడింది. ఈ దాడిలో రిజిత్ మృతి చెందగా, అతడి ముగ్గురు స్నేహితులు గాయపడ్డారు.

జనవరి 4న తలస్సేరి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారించింది. మొత్తం 10 మందిపై అభియోగాలు మోపగా, కేసు విచారణ సమయంలో ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించారు. శిక్ష పడిన తొమ్మిది మందిలో సుధాకరన్ (57), జయేష్ (41), రంజిత్ (44), అజీంద్రన్ (51), అనిల్‌కుమార్ (52), రాజేష్ (46), శ్రీకాంత్ (47), అతని సోదరుడు శ్రీజిత్ (43), భాస్కరన్ (67) ఉన్నారు. హత్య, హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద కోర్టు దోషులుగా నిర్ధారించింది.

Exit mobile version