PM Modi: నిఖిల్ కామత్‌తో తొలిసారి ప్రధాని నరేంద్రమోడీ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. తన చిన్నతనం నుంచి రాజకీయంగా ఎదిగిన క్రమాన్ని, ఆయన జీవితంలోని కొన్ని విషయాలను ఈ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ఈ రోజు నిఖిల్ కామత్ ‘పీపుల్’ సిరీస్‌లో మోడీ పాడ్‌కాస్ట్‌లో అరంగ్రేటం చేశారు.
అయితే, ప్రధాని నరేంద్రమోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ఉన్న స్నేహం గురించి నిఖిల్ కామత్ అడిగారు. చాలా సందర్భాల్లో పలు అంతర్జాతీయ వేదికలపై , ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రధాని మోడీ-మెలోనీ కలుసుకున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియా వేదికగా ‘‘మెలోడీ’’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యేది. మెలోడీ మీమ్స్ వచ్చేవి.
Read Also: PM Modi: జిన్‌పింగ్ గుజరాత్ పర్యటన వెనక చరిత్ర.. వెల్లడించిన ప్రధాని మోడీ..
దీనిపై నిఖిల్ కామత్ తెలివిగా ప్రశ్నించారు. “నాకు ఇష్టమైన ఆహారం పిజ్జా. మరియు పిజ్జా ఇటలీ నుండి వచ్చింది. మీకు ఇటలీ గురించి చాలా తెలుసని ప్రజలు అంటున్నారు’’ దాని గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా..? అని నవ్వుతూ అడిగారు. ‘‘మీరు ఈ మీమ్స్ చూడలేదా??’’ అని ప్రధానిని అడిగారు. ఈ ప్రశ్నకు ప్రధాని మోడీ నుంచి సమాధానం వచ్చింది. ‘‘లేదు. అలాంటివి జరుగుతూనే ఉంటాయి. నేను దానిలో నా సమయాన్ని వృధా చేసుకోలేను’’ అని సమాధానం ఇచ్చారు.
దీని తర్వాత చర్చను ప్రధాని మోడీ ఆహారం గురించి మళ్లించారు. ‘‘నేను భోజనప్రియుడిని కాదు. అందుకే నాకు ఏమి వడ్డించినా, ఏ దేశంలో అయినా, నేను దానిని ఆస్వాదిస్తాను’’ అని మోడీ వివరించారు. నన్ను రెస్టారెంట్‌కి తీసుకువెళ్లి మెనూ ఇచ్చి, ఎంచుకోమని అడిగితే, నేను చేయలేకపోవడం నా దురదృష్టం అంటూ ప్రధాని చెప్పారు. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్‌కి వెళ్లారా..? అని నిఖిల్ కామత్ ప్రశ్నించిన సమయంలో ‘‘లేదు, నేను ఇప్పుడు వెళ్లడం లేదు. నేను రెస్టారెంట్ వెళ్లి చాలా సంవత్సరాలు అయింది’’అని ప్రధాని సమాధానం ఇచ్చారు.