అప్పుడే పెళ్లి చేసుకున్న జంట.. ఉత్సాహంగా.. ఆలయంలో ఉన్న గజరాజు ముందు ఫొటోలకు పోజులిచ్చింది.. ఆ కొత్త జంటను తన కెమెరాలో బంధించే పనిలోపడిపోయారు.. వీడియో గ్రాఫర్, ఫొటో గ్రాఫర్.. అయితే, ఏమైందో ఏమో తెలియదు.. కానీ, ఒక్కసారిగా ఆ గజరాజుకు కోపం వచ్చింది.. ఆగ్రహంతో ఊగిపోయింది.. దాడి చేసింది.. ఈ ఘటనలో ఓ వ్యక్తి తృటిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు.. ఈ వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో వైరల్‌గా మారిపోయింది.. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కేరళ త్రిస్సూర్‌లోని గురువాయుర్ ఆలయంలో నవంబర్ 10వ తేదీన కొత్తగా పెళ్లి అయిన ఓ జంట మెడలో మాలలతో ఏనుగు సమీపంలోకి వెళ్లారు.. ఏనుగు ముందు నిలబడి ఫోటోలకు పోజులిచ్చారు.. వారికి కుడివైపుగా గజరాజు ఉండగా.. ఆ కొత్త జంటపై ఫోటోగ్రాఫర్ కెమెరాను క్లిక్ మనిపించసాగారు.. అయితే, ఆ కెమెరా ఫ్లాష్ వల్లో.. మరే కారణమో తెలియదు.. కానీ, ఆగ్రహానికి గురైన ఏనుగు ఒక్క సారిగా దాడికి దిగింది.. అప్పటికే ఏనుగుపై ఉన్న మావటి అదుపు చేసేందుకు ప్రయత్నించడంతో.. అతడిని ఎత్తి కిందకు విసిరింది.. ఇక, తొండంతో అతడిని పైకెత్తేందుకు యత్నించగా.. జారిపోయిన మావటి.. కింద పడి.. ఆ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు.. కానీ, ఏనుగు తొండంతో పైకి ఎత్తే ప్రయత్నం చేసిన సమయంలో.. అతని శరీరంపై ఉన్న బట్టలు మొత్తం ఊడిపోయాయి.. ఇక, ఏనుగుపై ఉన్న మరో మావటి ఆ గజరాజును అదుపు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి..
ఏనుగు ఆగ్రహంతో దాడి చేసిన వీడియోను వెడ్డింగ్ మోజిటో అనే ఫోటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గురువాయూర్ ఆలయం ఉన్న త్రిస్సూర్‌లో నవంబర్ 10న ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు… ఇది ఆలయ ముఖద్వారం దగ్గర ఉన్న భక్తులను కలిచివేసింది. ఏడు రోజుల క్రితం పోస్ట్ చేసినప్పటి నుండి ఇది వైరల్‌గా మారిపోయింది.. 12 వందలకు పైగా క్లిక్స్ పొందింది.. ఇక, తమకు ఎదురైన ఈ సం ఘటననుపై ఆ వీడియోలో వివరించాడు పెళ్లి కొడుకు. మేం ఫోటోలు దిగుతోన్న సమమయంలో.. అంతా అరుస్తూ పరుగులుపెట్టారు.. ఆ సమయంలో తన భార్య చేతిని పట్టుకుని అక్కడి నుంచి లాక్కెళ్లినట్లు ఆ వరుడు వివరించాడు.. కాగా, గురువాయూర్ దేవాలయం హిందూ వివాహ ఆచారాలకు చాలా ప్రసిద్ధి చెందింది.. ఆ ఆలయంలో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.