Site icon NTV Telugu

Bengaluru cafe blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుడి కొత్త వీడియో.. ప్రజల సాయం కోరిన ఎన్ఐఏ..

Bengaluru Cafe Blast

Bengaluru Cafe Blast

Bengaluru cafe blast: బెంగళూర్‌లో రామేశ్వరం కేఫ్ పేలుడు జరిగి వారం గడుస్తోంది. ఇప్పటికీ నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు వేటను సాగిస్తూనే ఉన్నాయి. నిందితుడికి సంబంధించిన పలు వీడియోలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా కర్ణాటక పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే నిందితుడికి సంబంధించిన తాజా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ముసుగు దరించి బూడిద రంగు చొక్క ధరించినట్లు ఈ వీడియోలో చూడవచ్చు. పేలుడు జరిగిన రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ వీడియోలో నిందితుడి విజువల్స్ రికార్డయ్యాయి. ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు ఎన్ఐఏ ప్రజల సహాయాన్ని కోరింది. ఇప్పటికే నిందితుడిని పట్టించిన వారికి రూ.10 లక్షల బహుమతిని ప్రకటించింది.

Read Also: Jaishankar: 15-20 ఏళ్ల భారత్‌లో సుస్థిర ప్రభుత్వం.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు..

నిందితుడు కేఫ్‌లో బాంబు పెట్టిన తర్వాత బట్టలు మార్చుకుని తుమకూర్ బస్సు ఎక్కినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత బళ్ళారి వరకు అతడి కదలికలను ట్రేస్ చేసినట్లుగా కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర తెలిపారు. బాంబర్ సంఘటన జరిగిన రామేశ్వరం కేఫ్‌కి వచ్చేందుకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించాడు. ఈ కేసులో ఎన్ఐఏ, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బళ్లారిలోని కౌల్ బజార్‌కి చెందిన ఒక బట్టల వ్యాపారిని అదుపులోకి తీసుకుంది. ఇతను నిషేధిత పీఎఫ్ఐలో కీలక సభ్యుడిగా ఉన్నాడని, ఈ కుట్రలో భాగమే అని అనుమానిస్తున్నారు.

మార్చి 1న బెంగళూర్‌లో ఐటీ కారిడార్‌లో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో తక్కువ తీవ్రత కలిగిన ఐఈడీ బాంబు పేలుడు సంభవించింది. నిందితుడు ఓ బ్యాగులో బాంబును పెట్టినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఈ దాడిలో 10 మంది గాయపడ్డారు. టైమర్ సెట్ చేసి బాంబును పేల్చినట్లు పోలీసులు కనుక్కున్నారు.

Exit mobile version