Site icon NTV Telugu

Mamata Benerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది..

Bengal Cm Mamata Benerjee

Bengal Cm Mamata Benerjee

మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిని బీజేపీ, ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యల తరహాలోనే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్‌ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని అధికార కూడా త్వరలోనే పడిపోతుందని జోస్యం చెప్పారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అందుకే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజలు ఉండదని తెలిపారు. ఇండియా టుడే కన్‍క్లేవ్‌ ఈస్ట్‌ 2022 కార్యక్రమంలో ఆమె సోమవారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సర్కారు కొనసాగుతుందని తాను భావించడం లేదని.. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుండవచ్చు కానీ ప్రజల హృదయాలను గెలవలేరని ఆమె వెల్లడించారు.

Maharashtra: మహారాష్ట్ర ప్రజలకు శుభవార్త.. త్వరలో తగ్గనున్న ఇంధన ధరలు

మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని కూల్చవచ్చు, కానీ ఈ దేశ ప్రజలు ప్రజాస్వామ్య మార్గాల్లో మిమ్నల్లి కూల్చేస్తారని అని మమతా బెనర్జీ అన్నారు. శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు బీజేపీ డబ్బుతో పాటు చాలా ఇచ్చిందని ఆరోపించారు. షిండే ప్రభుత్వం కూలిపోతుందని, మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ కూడా ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. భాజపా తరచూ ఖండిస్తూ వస్తున్న వారసత్వ రాజకీయాలపైనా మమత బెనర్జీ స్పందించారు. భాజపా దేన్ని వారసత్వ రాజకీయం అంటోంది? బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ మరణం తర్వాత ఆయన కుమార్తె షేక్‌ హసీనా ఆ బాధ్యతలు చేపట్టారు. ఆమె కాకుండా ఇంకెవరు ఆ స్థానాన్ని భర్తీ చేసేవారు? అంటూ ఆమె ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలంటున్న బీజేపీ.. మరెందుకు హోంమంత్రి అమిత్‌ షా కుమారుడు జై షాకు బీసీసీఐలో అత్యున్నత పదవి కట్టబెట్టిందని విమర్శలు గుప్పించారు. ఈ వారసత్వ పదవి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు.

Exit mobile version