NTV Telugu Site icon

Himanta Biswa Sarma: అస్సాంలో మదర్సాలను మూసివేస్తాం.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Himanta On Madrassas

Himanta On Madrassas

New India Does Not Need Madrassas Says Himanta Biswa Sarma: అస్సాంలో ముస్లిం మత పాఠశాలలైన మదర్సాలన్నింటినీ ముసివేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆధునిక భారతదేశంలో మదర్సాల అవసరం ఏమాత్రం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కర్ణాటకలోని బెళగావిలో గురువారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మనకి మదర్సాల అవసరం లేదని, ఇంజినీర్లు & డాక్లర్ల అవసరం ఉందని చెప్పారు. మదర్సాల కంటే మన భారతదేశానికి , అస్సాం రాష్ట్రానికి సేవలు చేసేందుకు అవసరమైన డాక్టర్లు, ఇంజినీర్లు, ఇతర వృత్తి నిపుణులను తయారు చేసే స్కూళ్లు, కాలేజీలతో మాత్రమే అవసరం ఉందని పేర్కొన్నారు.

Vladimir Putin: వ్లాదిమిర్ పుతిన్‌పై ప్రపంచ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ

ఇప్పటికే రాష్ట్రంలోని 600 మదర్సాలను మూసివేశామని, మిగతా వాటిని కూడా క్రమంగా మూసేస్తామని హిమంత బిశ్వ శర్మ అన్నారు. నిత్యం బంగ్లాదేశ్‌ నుంచి వస్తున్న జనంతో.. మన భారత సంస్కృతి, ఆచారాలకు ముప్పు ఏర్పడిందన్నారు. మన దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లమని గర్వంగా చెప్పుకునే వాళ్లు చాలామంది ఉన్నారు కానీ.. హిందువును అని గర్వంగా చెప్పుకునే వారు కావాలన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చరిత్రను వక్రీకరించాయని ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్‌ను నయా మొఘలుల పార్టీగా అభివర్ణించారు. ఒకప్పుడు మొఘలులు భారత్‌ను బలహీనం చేసేందుకు ప్రయత్నించారని.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని చెప్పుకొచ్చారు. ఈ విధంగా అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పంగా మారాయి. వీటిపై రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది.

Groom Sings Song: వేదికపై పాట పాడాడు.. పెళ్లి పెటాకులైంది

కాగా.. అస్సాంలో ప్రస్తుతం 3,000 నమోదిత, నమోదుకాని మదర్సాలు ఉన్నాయి. గతంలో హిమంత బిశ్వ శర్మ మదర్సాలను తగ్గించాలని లేదా మదర్సాలలో ఇస్తున్న విద్యను పరిశీలించాలని సూచించారు. 2020లో అన్ని ప్రభుత్వ మదర్సాలను ‘రెగ్యులర్ స్కూల్స్’గా మార్చడానికి వీలు కల్పించే చట్టాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. విద్య పట్ల సానుకూల దృక్పథం ఉన్న బెంగాలీ ముస్లింలతో.. మదర్సాలలో ‘మంచి వాతావరణాన్ని’ సృష్టించేందుకు రాష్ట్ర పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు. మదర్సాలలో సైన్స్, గణితం కూడా సబ్జెక్టులుగా బోధించబడుతుందని.. విద్యాహక్కు గౌరవం, ఉపాధ్యాయుల డేటాబేస్ నిర్వహించబడుతుందని వెల్లడించారు.

Show comments