NTV Telugu Site icon

Benjamin Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును కాల్చి చంపాలి.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

Congress Mp

Congress Mp

Benjamin Netanyahu: ఇజ్రాయిల్- హమాస్ యుద్ధం తీవ్రంగా సాగుతోంది. గాజాపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1400 మందిని హతమార్చడమే కాకుండా.. 240 మందిని బందీలుగా చేసుకుని గాజా స్ట్రిప్ లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత నుంచి గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇప్పటికే అక్కడ ఇజ్రాయిల్ దాడుల వల్ల 11 వేల మంది చనిపోయారు.

ఇదిలా ఉంటే ఇజ్రాయిల్-హమాస్ వార్ మనదేశంలో కూడా రాజకీయాంశంగా మారింది. ముఖ్యంగా కేరళలో హమాస్, పాలస్తీనాలకు మద్దతుగా అక్కడి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక్క అధికార సీపీఎం పార్టీనే కాకుండా కాంగ్రెస్, ముస్లింలీగ్ వంటి పార్టీలు కూడా పోటాపోటీగా ర్యాలీలు చేస్తున్నాయి. ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో జరిగిన మద్దతు ర్యాలీలో ఇండియా, ఇజ్రాయిల్ తో పలు ఒప్పందాలను రద్దు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Read Also: Animal: అర్జున్ రెడ్డి మత్తు నుంచి ఇంకా బయటకు రాలేదా అన్న..

ఇక ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విధంగా ర్యాలీలు నిర్వహించింది. కోజికోడ్ వేదికగా ఆ పార్టీ పాలస్తీనా సంఘీభావ ర్యాలీ చేసింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాసర్‌గోడ్‌లో జరిగిన ర్యాలీలో మాట్లడుతూ.. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ యుద్ధ నేరస్తుడని, విచారణ లేకుండా కాల్చి చంపాలని చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధనేరాల్లో నిమగ్నమైన వారిని న్యూరెమ్‌బర్గ్ ట్రయల్స్ అని పిలిచేవారు, ఎలాంటి విచారణ లేకుండా నేరస్తులను కాల్చి చంపారు, ఇదే విధంగా నెతన్యాహును కాల్చి చంపాల్సిన సమయం వచ్చిందని, ఎందుకంటే అతడు చేస్తున్న క్రూరత్వం ఆ స్థాయిలో ఉందని అన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నవంబర్ 23న కోజికోడ్ వేదికగా కేరళ పీసీసీ భారీ మద్దతు ర్యాలీని నిర్వహించబోతోంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాలస్తీనా అనుకూల కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.