Nepal Protests: సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా నేపాల్ అట్టుడుకుతోంది. జెన్-జీ యువత పెద్ద ఎత్తున నిరసన తెలుపుతునున్నారు. ఈ నిరసన హింసాత్మక చర్యలకు దారి తీసింది. ఆందోళనకారులు ప్రధాని కేపీ ఓలీ నివాసంతో పాటు అధ్యక్షుడి నివాసం, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలపై దాడులు చేసి, నిప్పటించారు. ఇదిలా ఉంటే, హింసాత్మక ఘటనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, సైన్యం సలహాతో కేపవీ శర్మ ఓలి తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లోని పనిటాంకి వద్ద ఉన్న నేపాల్-భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్ విధించారు.
Read Also: Nepal: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా.. నిరసనలు పెరగడంతో దుబాయ్‌కి…
ఇదిలా ఉంటే, ప్రభుత్వ అధికారు తరలింపులో భాగంగా ఖాట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భైసేపతి మినిస్టీరియల్ క్వార్టర్ల నుంచి దాదాపుగా డజనుకు పైగా హెలికాప్టర్లు బయలుదేరాయి. అధికారులు, మంత్రుల తరలింపులను అడ్డుకునేందుకు, విమాన సర్వీసులకు అంతరాయం కలిగించేందుకు యువత టపాసులు పేల్చడంతో పాటు డ్రోన్లను ఎగరేయడం, లేజర్ల లైట్లను నిరసనకారులు ఉపయోగిస్తున్నారు.
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్‌లో మాట్లాడారు. పరిస్థితి దిగజారుతున్న తరుణంలో ప్రధాని నివాసం నుంచి తనను సురక్షితంగా వెళ్లేలా చేయాలని సైనిక సాయం కోరారు. పరిస్థితి దిగజారుతున్న తరుణంలో ఆయనను తరలించేందుకు ప్రణాళిక వేస్తున్నారు. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 300 మందికి పైగా సైనిక సిబ్బందిని మోహరించారు. నేపాల్ ప్రధాని దేశం వదిలి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేపాల్‌తో సరిహద్దు కలిగిన భారతదేశ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
