NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..
- నీట్ యూజీ రీటెస్ట్ కోసం భారీ భద్రత..
- పేపర్ల తరలింపుకు ఇండియన్ ఏయిర్‌ఫోర్స్..
- ప్రశ్నాపత్రాల భద్రతకు సైన్యం, భద్రతా సంస్థల మోహరింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET: జూన్ 21న జరుగనున్న NEET-UG 2026 రీ-టెస్ట్ కోసం భారత వైమానిక దళం (IAF) రంగంలోకి దిగింది. పేపర్ లీకేజీ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రాలను సురక్షితంగా తరలించేందుకు Mi-17 హెలికాప్టర్లు, ఇతర వైమానిక వనరులను మోహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాలను నిర్ణీత 18 ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న పంపిణీ కేంద్రాలకు, పరీక్షా కేంద్రాలకు సకాలంలో సురక్షితంగా తరలించేందుకు ఐఎఎఫ్ సహకరించనున్నట్లు తెలుస్తోంది.
గతంలో పరీక్ష రద్దుకు దారితీసిన అక్రమాలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు విస్తృత భద్రతా ప్రణాళికలో భాగంగా ఈ చర్య చేపట్టారు. ప్రశ్నాపత్రాలను రూపొందించే నిపుణులు, మోడరేటర్లు, అనువాదకుల్ని ఇప్పటికే ఒక రహస్య ప్రదేశానికి తరలించారు. పరీక్ష పూర్తయ్యే వరకు వారంతా అక్కడే ఉండాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు లేకుండా వారిని ఉంచారు. ప్రశ్నా పత్రాల తయారీ నుంచి వాటి నిల్వ, రవాణా, పంపిణీ ప్రతీ దశను పర్యవేక్షించడానికి భద్రతా సంస్థలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అవసరమైతే అదనపు బలగాలను కూడా మోహరించేందుకు సిద్ధంగా ఉన్నారు.
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈకేసులో కీలక సూత్రధారుల్ని ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని నింపేందుకు ఈ పరీక్షను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. ప్రశ్నాపత్రాల భద్రత, పారదర్శకత, పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు అత్యంత కఠినమైన భద్రతా చర్యల్ని తీసుకున్నారు.
తాజావార్తలు
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?