NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- నీట్ పేపర్ లీక్‌లో బయాలజీ లెక్చరర్ అరెస్ట్..
- నిన్న కెమిస్ట్రీ టీచర్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ..
- పేపర్ సెట్ చేసిన వారి ద్వారానే లీక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Paper Leak: నీట్-యూజీసీ పేపర్ లీక్‌లో వరస అరెస్టులు జరుగుతున్నాయి. శుక్రవారం కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణిని సీబీఐ అరెస్ట్ చేసింది. శనివారం మరో మహిళా లెక్చరర్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. బోటనీ ఉపాధ్యాయురాలిగా ఉన్న పూణేకు చెందిన మనీషా గురునాథ్ మంధారేను ఢిల్లీలో అరెరస్ట్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆమెను ఎక్స్‌పర్ట్‌గా నియమించిన తర్వాత, ఆమె పేపర్ తయారీ ప్రక్రియలో పాల్గొన్నట్లు సీబీఐ చెప్పింది. ఈ అరెస్టుతో మొత్తం అరెస్టుల సంఖ్య 9కి చేరింది.
Read Also: Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్‌బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
Also Read
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
ఇప్పటికే అరెస్టయిన మనీషా వాఘ్మారే ద్వారా మనీషా కొంత మంది నీట్ అభ్యర్థులతో ఏప్రిల్ నెలలోనే సంప్రదింపులు జరిపింది. దీని తర్వాత తన ఇంట్లోనే కోచింగ్ క్లాసులు నిర్వహించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. బోటనీ, జువాలజీలో వచ్చే ప్రశ్నల్ని ముందుగానే విద్యార్థులకు చెప్పి, తప్పకుండా ఇవే పరీక్షలో వస్తాయని వారితో ప్రాక్టీస్ చేయించినట్లు అధికారులు వెల్లడించారు. మే 3న పరీక్షలో వచ్చిన ప్రశ్నలు దాదాపుగా మనీషా లీక్ చేసిన ప్రశ్నలతో సరిపోలినట్లు తేలింది.
ఈ పేపర్ లీక్‌లో కులకర్ణి తర్వాత ఇప్పుడు మరో లెక్చరర్ అరెస్ట్ అయ్యారు. కులకర్ణి కూడా ఇలాగే కెమిస్ట్రీ ప్రశ్నలను ముందుగానే విద్యార్థులకు లీక్ చేశారు. తన ఇంట్లోనే కోచింగ్ నిర్వహించి విద్యార్థులకు ఇవే ప్రశ్నలు వస్తాయని చెప్పారు. గత 24 గంటల్లో సీబీఐ దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సీబీఐ, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, అహిల్యానగర్ ప్రాంతాలకు చెందిన నిందితులు ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!