Site icon NTV Telugu

Bihar Elections: ఎన్డీయే కూటమిలో తేలిన సీట్ల లెక్కలు.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..

Nda

Nda

Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాశ్వాన్‌ల ఎన్డీయే కూటమి సీట్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాలో పోటీ చేయనున్నాయి. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి 29 సీట్లు దక్కాయి. రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) చెరో ఆరు సీట్లలో పోటీ చేస్తాయి. 2020 బీహార్ ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 110 సీట్లలో పోటీ చేసింది.

243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు నవంబర్ 6 మరియు 11 తేదీల్లో జరుగుతాయి మరియు ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది. మరోవైపు, మహాఘటబంధన్(ఆర్జేడీ- కాంగ్రెస్- వామపక్షాలు)ల కూటమిలో ఇంకా సీట్ల లెక్కలు పూర్తి కాలేదు.

Exit mobile version