Site icon NTV Telugu

NCP Reunion: అజిత్ పవార్ మరణం..ఎన్సీపీ కలయిక.. కీలకంగా సునేత్ర పవార్..

Ncp

Ncp

NCP Reunion: అజిత్ పవార్ మరణంతో ఎన్సీపీలో ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే, ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) రెండు వర్గాలు తిరిగి కలిసేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల, మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఎన్సీపీ (అజిత్ పవార్), ఎన్సీపీ(శరద్ పవార్) వర్గాలు కలిసి పనిచేశాయి. ఇప్పుడు, అజిత్ పవార్ మరణంతో ఫిబ్రవరిలో రెండు కలిసే అవకాశం ఉందని ఆయా వర్గాలు వెల్లడించాయి. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెండు వర్గాలు ఎన్సీపీ కలయికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈలోపే బారామతి విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందారు.

Read Also: Salman Ali Agha: ప్రపంచ కప్‌లో ఎంట్రీపై ఉత్కంఠ మధ్య పాకిస్థాన్ కెప్టెన్ వింత ప్రకటన..

విలీనాన్ని ఖరారు చేయడానికి రెండు వర్గాల నాయకులు వచ్చే వారం సమావేశమయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. అయితే, అజిత్ పవార్‌ వర్గానికి చెందిన కొంత మంది నాయకులు మాత్రం తక్షణ విలీనాన్ని కోరుకోవడం లేదని, దీనిని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ వర్గానికి చెందిన వారు మాత్రం తక్షణ విలీనం కోసం ఎదురుచూస్తున్నాయి.

విలీన ప్రక్రియలో అజిత్ పవార్ భార్య, రాజ్యసభ ఎంపీ సునేత్రా పవార్ కీలకంగా మారారు. విలీనం తర్వాత ఎన్సీపీకి చీఫ్‌గా శరద్ పవార్ కాకుండా, సునేత్ర పార్టీ అధ్యక్ష రేసులో ముందు వరసలో ఉన్నారు. ఎన్సీపీలోని మెజారిటీ వర్గం సునేత్రా పవార్ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, మరో కీలక నేత ప్రఫుల్ పటేల్ పార్టీ చీఫ్ రేసులో ప్రముఖంగా ఉన్నారు.

Exit mobile version