NCP Reunion: అజిత్ పవార్ మరణంతో ఎన్సీపీలో ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే, ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) రెండు వర్గాలు తిరిగి కలిసేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల, మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఎన్సీపీ (అజిత్ పవార్), ఎన్సీపీ(శరద్ పవార్) వర్గాలు కలిసి పనిచేశాయి. ఇప్పుడు, అజిత్ పవార్ మరణంతో ఫిబ్రవరిలో రెండు కలిసే అవకాశం ఉందని ఆయా వర్గాలు వెల్లడించాయి. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బాబాయ్, అబ్బాయ్‌లు ఎన్సీపీ కలయికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.…