Site icon NTV Telugu

Supriya Sule: అజిత్‌ పవార్‌కు పార్టీ పగ్గాలు ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ.. బీజేపీతో జత కట్టాడు.. !

Supreiya

Supreiya

Supriya Sule: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పగ్గాలు తన కజిన్‌ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైనప్పటికీ ఆయన తమను వీడి వెళ్లారని ఎంపీ సుప్రీయా సూలే అన్నారు. అలాగే, తమను అనేక ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ మేరకు కామెంట్స్ చేసింది. ‘అడిగితే అన్ని ఇచ్చేవాళ్లం.. ఎన్సీపీ లీడర్‌ను చేసే వాళ్లం కూడా.. కానీ ఆయన ఏదో ఊహించుకుని పార్టీని వీడిచి పెట్టి వెళ్లారు.. మా జీవితాలను ఇబ్బందుల పాలు చేసేశారు అంటూ మండిపడింది. ఇది వారసత్వ సమస్య కానే కాదు అని సుప్రీయా సూలే అన్నారు.

Read Also: Astrology: సెప్టెంబర్ 26, గురువారం దినఫలాలు

అలాగే, ఎన్సీపీకి నాయకత్వం వహించేందుకు నేను ఆయనకు పోటీ రాలేదు అని ఎంపీ సుప్రీయా సూలే తెలిపారు. ఇది కేవలం కూటమి సమస్య.. ఆయన బీజేపీ, శివసేన కూటమిగా వెళ్లాలనుకుని వెళ్లిపోయారని తెలిపింది. ఈ విషయంలో అజిత్‌ పవార్‌తో తాను బహిరంగ చర్చకు రెడీగా ఉన్నాను అని సూలే సవాల్‌ చేసింది. కాగా, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్‌ పవార్‌ నేతృత్వంలో నడుస్తున్న ఎన్సీపీలోని ఎక్కువ మంది ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టుకున్న అజిత్‌ పవార్‌ బీజేపీ, శివసేన ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆ తర్వాతి పరిణామాల్లో అసలైన ఎన్సీపీని కూడా అజిత్‌ పవార్ కైవశం చేసుకున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు సుప్రీయా సులే వెల్లడించింది.

Exit mobile version