ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వేదిక తయారు చేసేందు వడివడిగా అడుగులు వేస్తున్నాయి ప్రతిపక్షాలు.. ఇప్పటికే సీనియర్ రాజకీయవేత్త శరాద్ పవార్‌తో రెండు దపాలుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చర్చలు జరపగా.. రేపు ప్రతిపక్షపార్టీలు సమావేశం అవుతున్నాయి… ఈ సమావేశానికి హాజరుకావ్సాలిందిగా.. ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానాలు పంపిరారు శరాద్ పవార్, యశ్వంత్ సిన్హా,.. కేవలం 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలే కాకుండా, వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో సహా బీజేపీకి వ్యతిరేకంగా సమిష్టి పోరాటానికి సిధ్ధమయ్యేందుకు సమాలోచనలు చేయనున్నారు..
ప్రతిపక్ష పార్టీలకు యశ్వంత్ సిన్హా కు చెందిన “రాష్ట్ర మంచ్” తరఫున ఆహ్వానాలు పంపారు.. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై చర్చించేందుకు రావాలని ప్రతిపక్షాలకు ఆహ్వానాలు పంపించారు.. మొత్తంగా పవార్, యశ్వంత్ సిన్హా అధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశం నిర్వహించనున్నారు.. కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు యశ్వంత్ సిన్హా.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.. ఇక, రేపటి సమావేశానికి అందరికీ ఆహ్వానాలు వెళ్లగా.. కాంగ్రెస్ పార్టీ కి చెందిన వివేక్ టన్కా, రాష్ట్రీయ జనతాదళ్ కు చెందిన మనోజ్ ఝా, ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన సంజయ్ సింగ్ తదితరలు ఆహ్వానాలు అందుకున్నారు.. బీజేపీకి చెందిన చాలా మంది నేతలు పవార్ ప్రయత్నాలకు మౌనంగా మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ప్రధాని మోడీ ప్రతిష్ట బాగా పడిపోయిందని గ్రహించడంతో పాటు, బీజేపీని ఎదుర్కొనే అవసరం, సమయం ఆసన్నమైందని భావించిన అధికార బీజేపీ నేతలందరూ.. పవార్ ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు శివసేనకు నేత సంజయ్ రౌత్… ఈ అంశంపై పవార్ తో ఇప్పటికే మాట్లాడారాయన.
