Site icon NTV Telugu

పంజాబ్‌లో విభేదాలు తారాస్థాయికి.. ఎమ్మెల్యేలతో సిద్ధూ భేటీ..

Navjot Singh Sidhu

Navjot Singh Sidhu

ఓవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే.. మరోవైపు పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు ముదిరిపోతున్నాయి… సీఎం అమరీందర్‌ సింగ్, పీసీసీ కొత్త చీఫ్ నవజోత్‌ సింగ్‌ సిద్ధూకి అసలు పొసగకుండా తయారవుతోంది పరిస్థితి.. కాంగ్రెస్‌ అధిష్టానం, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ జోక్యం చేసుకుని సిద్ధూకి పీసీసీ చీఫ్ పోస్టు ఇచ్చిన తర్వాత కూడా పరిస్థితి సద్దుమనిగినట్టు కనిపించడంలేదు.. ఇక, తనకు మద్దతుగా ఉన్న 62 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఇవాళ సిద్ధూ సమావేశం అయ్యారు.. అమృత్‌సర్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యేలకు అల్పాహారానికి ఆహ్వానించిన ఆయన.. వారితో సమావేశం అనంతరం.. బస్సులో గోల్డెన్ టెంపుల్‌తోపాటు పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శనకు వెళ్లారు. సిద్ధూకు తాము అండగా ఉంటామని.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు. మొత్తంగా ఈ సమావేశం.. నాకు ఇంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సిద్ధూ.. బలనిరూపణకు పూనుకున్నాడని కామెంట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Exit mobile version