కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఓటరు సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టింది. దీనిపై విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టినా.. తర్వాత సైలెంట్ అయిపోయాయి. బంగ్లాదేశ్, మయన్మార్ సహా ఆయా దేశాల నుంచి వచ్చిన వారంతా ఆయా రాష్ట్రాల్లో తిష్ట వేసిన నేపథ్యంలో ఈసీ సర్వే చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టాకే బీహార్ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: Stock Market: మార్కెట్‌లో కొత్త జోష్.. భారీ లాభాల్లో దూసుకెళ్తున్న సూచీలు
ఎన్నికల సంఘం చేపట్టిన సర్వే బీహార్‌లో విజయవంతం కావడంతో వచ్చే ఏడాదిలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో దశలవారీగా ఓటరు సమగ్ర సవరణ సర్వే చేపట్టాలని ఈసీ భావిస్తోంది. తొలుత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయో.. ఆ రాష్ట్రంలో సర్వే ప్రారంభించి అనంతరం క్రమక్రమంగా అన్ని రాష్ట్రాల్లో సర్వే చేపట్టాలని ఆలోచన చేస్తోంది. నవంబర్ నుంచి తమిళనాడులో ప్రత్యేక సర్వే చేపట్టొచ్చని సమాచారం.
ఇది కూడా చదవండి: Bihar Elections: ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్.. కాసేపట్లో ఉమ్మడి ప్రకటన
దేశ వ్యాప్త సర్వేపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత సీఈవోలతో రెండు రోజుల కమిషన్ సభ్యుల సమావేశం ప్రారంభమైనట్లుగా సమాచారం. సర్వే నిర్వహణపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఎన్నికల సంఘం దిశానిర్దేశం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ ప్రారంభం నుంచే ఈ సర్వే చేపట్టాలని సూచించినట్లుగా తెలుస్తోంది. తొలుత వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోనే ఈ సర్వేను ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: PM Modi: ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ దూరం! కారణమిదే!
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్‌లో ఓటరు జాబితా ప్రక్షాళన జరిగింది. అనంతరం సెప్టెంబర్ 30న దాదాపు 7.42 కోట్ల పేర్లతో తుది జాబితాను విడుదల చేసింది. దీనిపై విపక్షాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. దీంతో ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇదే మాదిరిగా అన్ని రాష్ట్రాల్లో సర్వేకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.
