Site icon NTV Telugu

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. సోనియా, రాహుల్కి బిగుస్తున్న ఉచ్చు..

Cng

Cng

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఢిల్లీ పోలీసులు తాజాగా వీరిపై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం (EOW) ఈ ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది. ఈ తాజా ఎఫ్ఐఆర్‌లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు మరో ఆరుగురి పేర్లను చేర్చారు. వీరు నేరపూరిత కుట్రకు పాల్పడినట్లుగా పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు.

Read Also: JC Soundbars: జస్ట్ కోర్సెకా నుంచి సరికొత్త సౌండ్‌బార్‌లు.. అతి తక్కువ ధరలో 200W ఆడియో ఔట్‌పుట్‌! ఇక ఇంట్లో డబిడదిబిడే

అయితే, ఈ కేసులో కోల్‌కతా కేంద్రంగా ఉన్న షెల్ కంపెనీ ‘డోటెక్స్ మర్చండైజ్’ పేరును కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. డోటెక్స్ ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)ను స్వాధీనం చేసుకోవడంలో జరిగిన అక్రమాలపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో తదుపరి విచారణలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.

Exit mobile version