Corporate Jihad: నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’.. హిందూ ఉద్యోగులే టార్గెట్.. నమాజ్ చేస్తేనే సాలరీ హైక్..
- సంచలనంగా నాసిక్ ‘‘కార్పొరేట్ జిహద్’’ కేసు..
- సీనియర్ ముస్లిం ఉద్యోగుల అరాచకాలు..
- నమాజ్ చేయాలని, బీఫ్ తినాలని ఒత్తిడి..
- ఈ కేసులో ఏడుగురు నిందితుల అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corporate Jihad: నాసిక్ ‘‘ కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీ బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్(బీపీఓ) యూనిట్‌లోని ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మత విషయాల్లో బలవంతాలకు పాల్పడటం వంటివి సంచలనంగా మారాయి. ఈ కేసులో మొదటి ఫిర్యాదు మార్చిలో అందింది. దర్యాప్తు జరిగినా కొద్ది, బాధితుల సంఖ్య పెరిగింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
ఉద్యోగుల జీతం పెంపు, ఉద్యోగ భద్రత కోసం నమాజ్ చేయాలని, బీఫ్ తినాలని బలవంతం చేసినట్లు బాధితులు ఆరోపించినట్లు సమాచారం. ఒక యువతి మార్చి 25న డియోలాలి క్యాంప్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో ఈ కేసు మొదట వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. 2022 నుంచి 2026 వరకు చాలా ఏళ్లుగా ఈ సంఘటలు జరిగాయని, లైంగిక వేధింపులు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసే చర్యలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించింది.
Also Read
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
ఈ ఫిర్యాదు తర్వాత, నాసిక్ పోలీసులు దర్యాప్తును విస్తృతం చేశారు. రోజుల వ్యవధిలోనే బాధితులు ముందుకు వచ్చారు. ఈ కేసులో మొత్తం 9 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇందులో 8 మంది మహిళలు, ఒక పురుషుడి వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. ఈ కార్పొరేట్ రాకెట్‌ను వెలికితీయడానికి పోలీసులు ప్రత్యేకంగా అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ యూనిట్‌లో మొత్తం ముగ్గురు మహిళా అధికారులు కీలకంగా వ్యవహరించారు. సాక్ష్యాలు బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
Read Also: Devendra Fadnavis: కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీని తొలగించవచ్చు.. ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు..
టీమ్ లీడర్ పోస్టుల్లో చాలా కాలంగా పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు, తమ కన్నా జూనియర్లు అయిన హిందూ ఉద్యోగులను లైంగికంగా దోపిడీ చేశారు. బాధితులు ఉద్యోగం కోల్పోతామనే భయం లేదా ఇతర చర్యలకు గురవుతామనే భయంతో వీరిపై ఫిర్యాదు చేయడానికి వెనుకాడారు. ఈ సంఘటనపై హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఈ కేసులో ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషీ, రజా మెమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్‌లతో సహా పలువురిని అరెస్టు చేశారు. ఒక ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని కారణంగా ఒక హెచ్ఆర్ అధికారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తమ అధికారాన్ని ఉపయోగించుకుని నిందితులు తమ కింది ఉద్యోగుల్ని బలవంతంగా లొంగదీసుకున్నట్లు తేలింది.
ఈ కేసును బీజేపీ నేత నితీష్ రాణే కార్పొరేట్ జిహాద్‌గా అభివర్ణించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయం తీవ్రమైందిగా చెప్పారు. ఇలాంటి సంఘటనలకు చోటు లేదని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హిందూ బాధితుల్ని నమాజ్ చేయాలని, బీఫ్ తినాలని బలవంతం చేసినట్లు, మతాన్ని అవమానించినట్లు మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ ఆరోపించారు. బాధితుల మతం మార్చడానికి కూడా ప్రయత్నించినట్లు చెప్పారు.
Nashik, Maharashtra: Minister Girish Mahajan says, "In the TCS company in Nashik, where many young girls work. The way this incident has happened is very unfortunate and shameful. Regarding religious conversion, there are 4-5 Muslim company workers and some officers who lured the… pic.twitter.com/LQ8UcAjfX4
— IANS (@ians_india) April 10, 2026
తాజావార్తలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!