Site icon NTV Telugu

Narendra Modi : రండి.. తరలిరండి.. ఓటు హక్కు వినియోగించుకొండి

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు, ఉత్తరప్రదేశ్‌లో మూడో దశ పోలింగ్ ఆదివారం ప్రారంభమైన సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రాష్ట్రాల ప్రజలను ముఖ్యంగా యువతతో పాటు మొదటిసారి ఓటు వేయబోతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. ‘పంజాబ్‌ ఎన్నికలు, యూపీ మూడో దశ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఈరోజు ఓటు వేసే వారందరికీ, ప్రత్యేకించి యువతతో పాటు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని నేను పిలుపునిస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో మూడో దశ ఎన్నికలకు సంబంధించి 59 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్‌ జరగగా, పంజాబ్‌లోని 117 నియోజకవర్గాల్లో ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లోని 16 జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు మూడో విడత పోలింగ్ ఆదివారం జరగనుంది. 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో 25,794 పోలింగ్‌ కేంద్రాలు, 15,557 పోలింగ్‌ కేంద్రాల్లో 2.16 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అర్హత సాధించారు.

Exit mobile version