NTV Telugu Site icon

Nana Patole: రాజీనామా వార్తలు ఖండించిన మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్

Nanapatole

Nanapatole

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేసినట్లు ఉదయం నుంచి వార్తలు హల్‌చల్ చేశాయి. తాజాగా ఆయన స్పందిస్తూ.. ఆ వార్తలు నిజం కాదని కొట్టిపారేశారు. రాజీనామా చేయలేదని వెల్లడించారు. మహా వికాస్ అఘాడీ కూటమి చెక్కచెదరకుండా ఉందని నానా పటోలే స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: ఆర్ అండ్‌ బీ శాఖపై సీఎం సమీక్ష.. వారిని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని ఆదేశాలు

మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉండగా.. మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమి 48 చోట్లే గెలుపొందింది. 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం 16 స్థానాలు మాత్రమే గెలుచుకోవడంతో పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. 2021లో నానా పటోలే మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పోటీ చేసిన 17 స్థానాలకు గాను 13 స్థానాలను గెలుచుకుంది. అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన సాకొలీ స్థానం నుంచి 208 ఓట్ల ఆధిక్యంతో నానా పటోలే గెలుపొందారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: ఆర్ అండ్‌ బీ శాఖపై సీఎం సమీక్ష.. వారిని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని ఆదేశాలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 132, షిండే శివసేనకు 57, అజిత్ పవార్ ఎన్సీపీకి 41, ఉద్ధవ్ థాకరే పార్టీకి 20, కాంగ్రెస్‌కు 16, శరద్ పవార్ పార్టీకి 10, ఎస్పీకి 2, ఇతరులకు 10 సీట్లు వచ్చాయి. మొత్తం రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) కూటమి ఘన విజయం సాధించింది. ఇక బీజేపీ అయితే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి.. సంఖ్యాబలం కలిగి ఉంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 132 అసెంబ్లీ స్థానాలను కమలనాథులు కైవసం చేసుకున్నారు. బీజేపీకి వచ్చిన సీట్లలో సగం మాత్రమే షిండేకు చెందిన శివసేనకు వచ్చాయి. ఎన్సీపీకి 41 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే బీజేపీకి సపోర్టు చేశారు. ఎన్సీపీ మద్దతుతో బీజేపీ వ్యక్తి సీఎం కాబోతున్నారు.