ఇటలీ విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌కు చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో వారి కుమార్తెతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్! అనుమానాలే నిజమయ్యాయి!
జావేద్ అక్తర్(55), గుల్షన్(47) భార్యాభర్తలు. వీరికి ప్రఖ్యాత హోటలియర్ అనే హోటల్ నాగ్‌పూర్‌లో ఉంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుమార్తెలు అర్జూ అక్తర్ (21), షిఫా అక్తర్, కుమారుడు జాజెల్ అక్తర్ ఉన్నారు. కుటుంబమంతా యూరప్ విహారయాత్రకు వెళ్లారు. ఫ్రాన్స్ నుంచి ఇటలీ చేరుకున్నారు. అక్కడ ఒక మినీ వ్యాన్‌లో పర్యాటక ప్రాంతాల్లో విహరిస్తున్నారు. అయితే వీరి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఒక ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే దంపతులతో పాటు మినీ వ్యాన్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. అర్జూ అక్తర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక జాజెల్ అక్తర్‌కు స్పృహ రాగానే స్థానిక పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి బాధితులను రక్షించారు.
ఇది కూడా చదవండి: Modi-Trump: ట్రంప్‌పై మోడీ ప్రశంసలు.. కారణమిదే!
అయితే ప్రమాదం జరిగిన వెంటనే సహాయం అందకపోవడం వల్లే చనిపోయినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎవరూ సహాయం చేయలేదని తెలుస్తోంది. ఈ కారణంతోనే దంపతులు చనిపోయినట్లుగా సమాచారం. ఇక ప్రమాదంపై స్థానిక అధికారుల దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం అర్జూ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. నాగ్‌పూర్ దంపతుల మరణాలకు ఇటలీలోని భారత రాయబార కార్యాలయం సంతాపం వ్యక్తం చేసింది. వారి కుటుంబానికి సహాయం అందిస్తున్నట్లు తెలిపింది.