Karnataka: మైసూర్ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి సీరియస్
- మైసూర్ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం
- ఇద్దరు మృతి.. పలువురికి సీరియస్
- ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని మైసూరులో పబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెస్టోపబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. యజమానితో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు 26 ఏళ్ల సాహిన్ (డార్జిలింగ్), 24 ఏళ్ల ప్రకాశ్ (నేపాల్)గా గుర్తించారు. ప్రమాద సమయంలో పబ్‌లో ఉన్న వీరు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదంలో గాయపడిన వారిలో వినియోగదారులు సోను, రమేశ్, మహదేవ్ ప్రసాద్, ప్రజ్వల్, అవినాష్‌తో పాటు పబ్ యజమాని ప్రీతమ్ పుమీత్ ఉన్నారు. వీరిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రమాదం సంభవించే సమయానికి పబ్‌లో పలువురు ఉండటంతో కొంతసేపు భయాందోళనలు నెలకొన్నాయి. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్‌సర్క్యూట్ లేదా ఇతర కారణాల వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
Also Read
- Abhijeet Dipke: కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి.. నాలుగు సార్లు చెంపదెబ్బలు
- Kundu couple: దీదీ తృణమూల్‌ను తుత్తునకలు చేసిన కుందు దంపతులు? ఒక సాదాసీదా పార్టీని లోక్‌సభలోనే కింగ్ మేకర్‌గా ఎలా మార్చారు!
- PM Modi: స్లోవేకియాలో మోడీ పర్యటన.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
ప్రమాదం జరిగిన సమయంలో బార్లో 25 మందికి పైగా ఉన్నారని వర్గాలు తెలిపాయి. దట్టమైన పొగ భవనం అంతటా వేగంగా వ్యాపించడంతో చాలా మంది అందులో చిక్కుకుపోయారు. అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక దళం మండుతున్న భవనం నుంచి ఏడుగురిని విజయవంతంగా రక్షించింది. దట్టమైన పొగ కారణంగా దృశ్యమానత తగ్గి, బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో లోపల ఉన్నవారిలో భయాందోళనలు నెలకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తమను తాము కాపాడుకునే తీవ్ర ప్రయత్నంలో, కొందరు నివాసితులు భవనం పై అంతస్తు నుంచి దూకారని, దీని ఫలితంగా అదనపు గాయాలు అయ్యాయని సమాచారం.
తాజావార్తలు
-
Karnataka: మైసూర్ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి సీరియస్
-
Jana Sena Five Key Resolutions: ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’.. ఐదు తీర్మానాలకు ఆమోదం
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Harshith Reddy: అర్జున్ రెడ్డి’కి మా సినిమాకి ఏం సంబంధం లేదు
-
Southwest Monsoon: రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. పిడుగులతో కూడిన వర్షాలకు హెచ్చరిక
ట్రెండింగ్
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!