My Focus Is On Telangana Says Amit Shah: ఇప్పుడు తన ఫోకస్ మొత్తం తెలంగాణ మీదే ఉందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేవరకు ఎంత సమయమైనా కేటాయిస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇంట్లో జరిగిన తెలంగాణ బీజేపీ మినీ కోర్ కమిటీ మీటింగ్‌లో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో.. పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఎందరో యువకుల ఆత్మ బలిదానాలతో, సుదీర్ఘ పోరాటంతో తెలంగాణను ప్రజలు సాధించుకున్నారని, అయితే ఒక కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయ్యిందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు.. ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. గత తొమ్మిదేళ్ల నుంచి ఒక కుటుంబం చేతిలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో, కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు అందకుండా ఎలా దారి మళ్లించారో.. జనాలకు వివరించాల్సిందిగా సూచించారు.
Dangerous Man: డేంజరస్ మ్యాన్.. పాక్, చైనాల్లో శిక్షణ పొంది ముంబైలోకి ఎంట్రీ
అలాగే.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై అమిత్ షా చర్చించారు. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు.. రాష్ట్రంలో నిర్వహించాల్సిన కార్యక్రమాల రోడ్ మ్యాప్‌ను అందజేశారు. ఇప్పటి నుంచే 119 అసెంబ్లీ సీట్లలో బలమైన అభ్యర్థులను సిద్ధం చేసుకోవాలని, కనీసం 90 సీట్లలో నెగ్గాలన్న లక్ష్యంతో పని చేయాలని సూచించారు. బూత్, శక్తి కేంద్రాలు, మండల, నియోజకవర్గ స్థాయిలో బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యంగా.. ‘హర్ ఘర్ లోటస్’ ప్రోగ్రామ్‌ను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. మోడీ సర్కార్ ఎన్ని నిధులిచ్చింది? కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలవ్వకుండా కేసీఆర్ స్కార్ ఎలా అడ్డుకుంది? కేంద్రాన్ని బద్నాం చేసే రీతిలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాల వివరాల్ని గడప గడపకు తీసుకెళ్లాలని చెప్పారు. ‘‘ప్రస్తుతం నా దృష్టంతా కేవలం తెలంగాణపైనే ఉంది. రాష్ట్ర ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారు. దీన్ని అనుకూలంగా మలుచుకొని.. అధికారంలోకి వచ్చేదాకా పని చేయాలి’’ అని అమిత్ షా చెప్పుకొచ్చారు.
Love Tragedy: మరో యువతితో పెళ్లి.. ప్రియురాల్ని మర్చిపోలేక యువకుడు ఆత్మహత్య