NTV Telugu Site icon

Chirag Paswan: రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

Chiragpaswan

Chiragpaswan

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీని కలవలేకే తన తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ యూపీఏ నుంచి బయటకు వచ్చేశారని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: T Series: స్టార్ ప్రొడ్యూసర్ ఇంట తీవ్ర విషాదం

రాహుల్‌గాంధీని కలిసేందుకు 3-4 నెలలు ప్రయత్నించారని.. కానీ ఎప్పుడూ కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని చిరాగ్ పాశ్వాన్ అన్నారు. రాహుల్‌ను కలిసే అవకాశం లేకపోవడంతో.. విసుగుపోయి యూపీఏ నుంచి తన తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ బయటకు వచ్చేశారని చెప్పారు.

ఇది కూడా చదవండి: Pakistan: పాక్‌లో పట్టుబడ్డ అల్‌ఖైదా అధినేత బిన్‌లాడెన్ సన్నిహితుడు..

తాను, తన తండ్రి పదే పదే సోనియాగాంధీని కలిసేవాళ్లం అని చెప్పారు. కలిసినప్పుడల్లా.. రాహుల్ గాంధీని కూడా కలవమని చెప్పేవారని గుర్తుచేశారు. తీరా ఆయన్ను కలిసేందుకు ప్రయత్నిస్తే.. ఎప్పుడూ అందుబాటులోకి రాలేదన్నారు. అలా మూడు, నాలుగు నెలలు నిరీక్షించిన తర్వాత విసుగుపోయి.. యూపీఏ నుంచి బయటకు వచ్చేశామని చిరాగ్ పేర్కొన్నారు. అందుకే తాను రాహుల్ రాజకీయాలను మెచ్చుకోను అని కేంద్రమంత్రి, ఎన్‌జేపీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు.