Site icon NTV Telugu

Maharashtra: ముస్లిం మతగురువు దారుణ హత్య.. మహారాష్ట్రలో ఘటన

Maharashtra Incident

Maharashtra Incident

మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఆప్ఘనిస్తాన్ కు చెందిన ముస్లిం మత గురువును దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నాసిక్ జిల్లా యోలా పట్టణంలో చోటు చేసుకుంది. ఆప్థనిస్తాన్ కు చెందిన 35 ఏళ్ల మత గురువును యోలా పట్టణంలోని ఎంఐడీసీ ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్ లో మంగళవారం సాయంత్రం నలుగురు వ్యక్తులు కాల్చి చంపారు. హతుడిని ఖ్వాజా సయ్యద్ చిస్తీగా గుర్తించారు. ఆ ప్రాంతంలో హతుడు సూఫీ బాబాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అయితే హత్యకుగల కారణాలు ఇంకా తెలియరాలేదు.

హతుడి నుదిటిపై తుపాకితో కాల్చడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్య తరువాత దుండగులు, ఆయన ఎస్‌యూవీ స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. యోలా పోలీస్ స్టేషణ్ లో హత్యానేరం కింద కేసు నమోదు అయింది. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.

Read Also:Lavanya Tripathi: నాగార్జునతో రొమాన్స్ చేసి.. చైతూతో అలా నటించలేను

ఇటీవల దేశంలోని పలు సంఘటనలు ప్రజల మధ్య వైషమ్యాలు కలిగిస్తున్నాయి. గత వారం ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్యలాల్ ను ఇద్దరు మతోన్మాదులు అత్యంత దారుణంగా హత్య చేశారు. మహ్మద్ ప్రవక్తను అవమానించిన నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అతన్ని దారుణంగా చంపేశారు. ఈ హత్య దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. రాజస్థాన్ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే తరహాలో మహారాష్ట్ర అమరావతిలో ఉమేష్ కొల్హే అనే వక్తిని కూడా దుండగులు హతమార్చారు. ఈ కేసులో కూడా నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకే హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ రెండు కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారిస్తోంది.

Exit mobile version