మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఆప్ఘనిస్తాన్ కు చెందిన ముస్లిం మత గురువును దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నాసిక్ జిల్లా యోలా పట్టణంలో చోటు చేసుకుంది. ఆప్థనిస్తాన్ కు చెందిన 35 ఏళ్ల మత గురువును యోలా పట్టణంలోని ఎంఐడీసీ ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్ లో మంగళవారం సాయంత్రం నలుగురు వ్యక్తులు కాల్చి చంపారు. హతుడిని ఖ్వాజా సయ్యద్ చిస్తీగా గుర్తించారు. ఆ ప్రాంతంలో హతుడు సూఫీ బాబాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అయితే హత్యకుగల…