NTV Telugu Site icon

Non-veg Food At Temple: ఆలయంలో మాంసాహార తీసుకున్నాడని ఆరోపించారు అన్నామలై.. ఖండించిన ముస్లిం లీగ్ ఎంపీ!

Tamilnadu

Tamilnadu

Non-veg Food At Temple: తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లాలో గల ప్రసిద్ధ తిరుపరంకుండ్రం మురుగన్ దేవాలయ కొండపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ నవాస్ కానీ మాంసాహారం తిన్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. దీనిపై రామనాథపురం ఎంపీ స్పందించారు. ఈ సందర్భంగా అతడి చేసిన అభియోగాలను నిరూపించలేకపోతే రాజీనామా చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. నేను ఇప్పటి వరకు తిరుపరంకుండ్రం ఆలయ కొండపైకి వెళ్లలేదు లేదని ఎంపీ నవాస్ పేర్కొన్నారు.

Read Also: Donald Trump: ఉత్తర కొరియా అధ్యక్షుడితో త్వరలో భేటీ అవుతా

ఇక, కావాలనే తనపై బీజేపీ నేతలు అన్నామలై, ఎల్‌ మురుగన్‌, వానతి శ్రీనివాసన్‌లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని IUML ఎంపీ నవాస్ కానీ పేర్కొన్నారు. రెండు పార్టీల మధ్య విభజనను సృష్టించడానికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని రెండు వర్గాల మధ్య మతపరమైన అశాంతిని కలిగించే చర్యగా IUML ఎంపీ అభివర్ణించారు. అలాగే, తమిళనాడు వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఉన్న రామనాథపురం ఎంపీ కానీ, వక్ఫ్ బోర్డు చుట్టూ ఉన్న భూ వివాదాలపై కూడా మాట్లాడారు.. యాభై శాతం భూమి సికందర్ బాదుషా దర్గా వక్ఫ్ బోర్డుకు చెందినది.. అది ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించబడిందన్నారు.

Read Also: Minister Kishan Reddy: విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం

అయితే, తిరుపరంకుండ్రంలోని కొండపైకి జంతువుల రవాణాను పోలీసులు తాత్కాలికంగా నిలిపి వేశారు. దీంతో ప్రజలకు, పోలీసులకు మధ్య తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ కొండపై ఇంతకుముందు జంతుబలి ప్రబలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పోలీసులు, జిల్లా యంత్రాంగం విచారణ జరుపుతోంది అని రామనాథపురం ఎంపీ నవాస్ కానీ చెప్పుకొచ్చారు. ఇక, పోలీసులు నిలిపి వేసిన ప్రదేశానికి వెళ్లి నేను ఎలా బిర్యానీ తిన్నాను అని ఆరోపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.