NTV Telugu Site icon

Air Pollution: మాకు ఓపిక లేదు, ఆ పొగను అరికట్టండి.. సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్..

Delhi Air Pollution

Delhi Air Pollution

Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇది పూర్తిగా ప్రజల్ని చంపేస్తోందని, ఎంత మంది పిల్లలు నెబ్యులైబర్లపై ఉన్నారు.? అంటూ ప్రశ్నించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేవ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. దీనిపై శుక్రవారం తదుపరి విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు ప్రోత్సహాకాలు ఇచ్చినా, బలవంతపు చర్యలు తీసుకున్నా, ఎలాగైనా సరే పంట వ్యర్థాల దహనం ఆగాల్సిందే అని స్పష్టం చేసింది. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

ప్రతీసారి దీన్ని రాజకీయం చేయరాదని, ప్రతీ ఏడాది ఢిల్లీ ఇలా కాలుష్య కోరల్లో నలిగిపోకూడదని తక్షణమే ప్రభుత్వాలు పని ప్రారంభించాలని సుప్రీం ఆదేశించింది. ఈ విషయంలో మాకు ఇంకా ఓపిక లేదని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలను అక్టోబర్ 31న ఆదేశించింది. ఢిల్లీ, పొరుగు రాష్ట్రాల ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఎక్యూఎం) సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే వ్యవసాయ వ్యర్థాల దహనం 40 శాతం తగ్గాయని నివేదిక సూచించినప్పటికీ.. ఢిల్లీ కాలుష్యంలో మార్పు ఎందుకు కనిపించడం లేదని సుప్రీం ప్రశ్నించింది.

Read Also: Voltas: “వోల్టాస్‌”కి టాటా గుడ్ బై..?

పంజాబ్, ఢిల్లీలలో ఆప్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. ఈ మంటలు ఎందుకు ఇంకా కొనసాగుతున్నాయని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘మీరు నిందల్ని మార్చలేదు.. ఇది పూర్తిగా ప్రాణాలను తీయడమే, ఢిల్లీలో పరిస్థితి చూడండి, ఎంత మంది పిల్లలు నెబ్యులైజర్లపై ఉన్నారో’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రతీ ఏడాది నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఢిల్లీ వాయుకాలుష్యంలో చిక్కుకుంటోంది. ఇదిలా ఉంటే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వా వాహనాల సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే బస్సులు కూడా కాలుష్యానికి కారణమువుతున్నాయి, వాటిన సగం సామర్థ్యంతో నడపండి, ఘన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో కాల్చకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశించింది.