Mumbai Woman Slow Poisons, Kills Husband: భర్తకే తెలియకుండా ఉసురు తీసింది భార్య. తను తింటున్న ఆహారం, నీటిలో విషాన్ని కలిపి ఇస్తుందన్న విషయాన్ని కనుక్కోలేకపోయాడు. స్లో పాయిజన్ రూపంలో భర్తను హత్య చేసింది. దీనికి ఆమె స్నేహితుడు కూడా సహకరించారు. స్లో పాయిజన్ ఇవ్వడం వల్ల తాము దొరకం అనుకున్నారు కానీ పోలీసులకు చిక్కారు. ఈ ఘటన ముంబైలో జరిగింది.
వివరాల్లోకి వెళితే కమల్ కాంత్ షా, కవితలు భార్యభర్తలు. అయితే భార్య కవిత భర్త కమల్ కాంత్ కు తెలియకుండా స్నేహితుడు హితేష్ జైన్ సహాయంతో భర్త తినే ఆహారం, నీటిలో ఆర్సెనిక్, థాలియంని కలిపింది. స్లో పాయిజనింగ్ కారణంగా ఆరోగ్యం విషమించడంతో కమల్ కాంత్ సెప్టెంబర్ 3న బాంబే ఆస్పత్రిలో చేరాడు. అయితే 17 రోజుల తర్వాత సెప్టెంబర్ 19న ఆయన మరణించాడు. అయితే చికిత్స సమయంలో వైద్యుల బృందం కమల్ కాంత్ రక్తంలో హెవీ మెటల్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అతని రక్తంలో అసాధారణమైన రీతిలో ఆర్సెనిక్, థాలియం లోహాలు ఉన్నట్లుగా తేలింది.
Read Also: Food Poisoning: పెళ్లి భోజనం తిని 100 మందికి పైగా అస్వస్థత..
వైద్యులు ఈ విషయాన్ని ఆజాద్ మైదాన్ లోని పోలీస్ స్టేషన్ కు తెలిపారు. పోలీసులు ఈ ఘటణపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 9కి కేసును అప్పగించారు. విచారణ చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ భార్యతో సహా కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. కమల్ కాంత్ డైట్ కు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. చివరకు హితేష్ తో కలిసి భార్య కమలే హత్యకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. చాలా కాలంగా భార్య కమల్ కాంత్ తినే ఆహారం, పానీయాల్లో ఆర్సెనిక్, థాలియంలను కలుపుతోంది. ఈ లోహాలు కమల్ కాంత్ రక్తంలోకి చేరి విషంగా మారాయి. దీంతోనే కమల్ కాంత్ మరణించాడు. దాదాపుగా 17 రోజులు చికిత్స అందించిన కమల్ కాంత్ ప్రాణాలు కాపాడలేకపోయారు వైద్యులు. నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 302, 328, 120(బీ) సెక్షన్ల కింత కేసు నమోెదు చేశారు. నిందులను కోర్టులో హాజరుపరచగా.. పోలీసులు డిసెంబర్ 8వ తేదీ వరకు కస్టడీకి పంపారు.
