Govindananda Saraswati: “అవిముక్తేశ్వరానంద ఫేక్ బాబా”.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆటలాడుతోంది..
- అవిముక్తేశ్వరానంద ఓ ఫేక్ బాబా..
- రాహుల్ గాంధీతో కలిసి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు..?
- ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆటాడుతోంది..
- స్వామీ శ్రీ గోవిందానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govindananda Saraswati: స్వామి అవిముక్తేశ్వరానంద ఒక నకిలీ బాబా అంటూ స్వామీ శ్రీ గోవిందానంద సరస్వతి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఈ రోజుల్లో ముక్తేశ్వరానంద అనే నకిలీ బాబా పాపులర్ అవుతున్నాడు. ప్రధాని మోడీ పాదాలను తాకుతున్నాడు, అంబానీ లాంటి బడా వ్యాపారవేత్త ఇంటికి స్వాగతిస్తున్నాడు. టీవలో కొందరు ఆయనను ‘శంకరాచార్య’ అనే ట్యాగ్ ఇస్తున్నారు. ముక్తేశ్వరానంద్ నకిలీ బాబా, అతను తన పేరకు సాధు, సంత్ లేదా సన్యాసి జోడించుకునే అర్హత లేదని దేశ ప్రజలకు నేను సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఇక శంకరాచార్య గురించి మరిచిపోండి’’ అంటూ స్వామి శ్రీ గోవిందానంద సరస్వతి మహారాజ్ అన్నారు.
ముక్తేశ్వరానందపై ఉన్న వారణాసి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ని గోవిందానంద చూపించారు. అతను పరారీలో ఉన్నాడని, మేము ఇవన్నీ సుప్రీంకోర్టుకు చెప్పాలని అనుకుంటున్నామని, కానీ వారు తమకు తదుపరి తేదీలు ఇస్తున్నారని, మాకు న్యాయం కావాలని, అతను దేశానికి హానికరమని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ఈ పత్రాలన్నింటిని ముందుకు తెస్తున్నామని, అవిముక్తేశ్వరానంద ప్రజలను చంపడం, కిడ్నాప్ చేయడం, శ్రీరాముడి ప్రాణప్రతిష్టను ప్రశ్నించడం, అతను సన్యాసిగా నటిస్తూ వివాహాలకు హాజరవుతున్నాడని, అతను కేదార్‌నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం మాయమైందని చెబుతున్నారు, అతనికి బంగారం ఇత్తడికి తేడా తెలుసా..? అంటూ గోవిందానంద ధ్వజమెత్తారు. అవిముక్తేశ్వరానంద్ రాహుల్ గాంధీతో కలిసి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆటలాడుతోందని అన్నారు.
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
Read Also: Internet Shutdown: 24 గంటల పాటు ఇంటర్నెట్ బంద్..సోషల్ మీడియా యూజర్లకు హెచ్చరిక..
అవిముక్తేశ్వరానంద్‌కి కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని గోవిందానంద ఆరోపించారు. ప్రియాంకాగాంధీ సెప్టెంబర్ 12, 2022న అతడిని శంకరాచార్యగా సంబోధిస్తూ లేఖ రాశారని సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ అవిముక్తేశ్వరానంద్‌ని శంకరాచార్య అని సంబోధిస్తూ ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ ఎందుకు లేఖ రాశారు..? అని ప్రశ్నించారు. శంకరాచార్య అనేది కాంగ్రెస్ నిర్ణయింస్తుందా.? అని అడిగారు. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నిలబడిన ఆయనకు ఎవరు మద్దతు ఇస్తున్నారు..? అని ప్రశ్నించారు. గేమ్‌లో అవిముక్తేశ్వరానంద్ ఒక బొమ్మ అని అన్నారు. ప్రియాంకాగాంధీ లేఖ రాసినందున క్షమాపణలు చెప్పాలని, లేకుంటే సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తామన్నారు.
అక్టోబర్ 2022లో, ఉత్తరాఖండ్ జ్యోతిర్ పీఠానికి కొత్త శంకరాచార్యగా అవిముక్తేశ్వరానంద సరస్వతి పట్టాభిషేకాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. జ్యోతిష్ పీఠం కొత్త శంకరాచార్యగా అవిముక్తేశ్వరానంద నియామకాన్ని ఆమోదించలేదని పూరీలోని గోవర్ధన్ మఠానికి చెందిన శంకరాచార్య అఫిడవిట్ దాఖలు చేశారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జ్యోతిర్ పీఠాధిపతిగా తనను స్వామి స్వరూపానంద సరస్వతి వారసుడిగా ప్రకటించినట్లు అవిముక్తేశ్వరానంద సరస్వతి తప్పుడు క్లెమయ్ చేసినట్లు ఆరోపిస్తూ, సుప్రీంలో కేసు ఫైల్ అయింది.
ఇటీవల అవిముక్తేశ్వరానంద అంబానీ వివాహ వేడుకల్లో కనిపించాడు. ఆ సమయంలో ప్రధాని మోడీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీకి వెళ్లి ఆయనను కలిశారు. ఆ సమయంలో ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమయ్యాయి. సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉద్దవ్ ఠాక్రేకి వెన్నుపోటు పొడిచాడని అన్నారు. ప్రజలు దీంతో వేదనకు గురవుతున్నారని, ఈ లోక్‌సభ ఎన్నికల్లో దీని ప్రభావం కనిపించిందని, పార్టీని చీల్చి ఠాక్రేకి ద్రోహం చేశారని అన్నారు. మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా ప్రజల బాధ తీరదని వ్యాఖ్యానించారు. హిందూ ధర్మంలో ద్రోహం అతిపెద్ద పాపం అని, ద్రోహం చేసే వాడు హిందువు కాదని వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi: Govindananda Saraswati Ji Maharaj says, "… One fake baba named Avimukteshwaranand, the Prime Minister is touching his feet, industrialists like Ambani are welcoming him at their home… Avimukteshwaranand is fake no.1. Forget about Shankaracharya, adding… pic.twitter.com/n5ubvn7mSw
— ANI (@ANI) July 21, 2024
#WATCH | Delhi: Govindananda Saraswati Ji Maharaj says, "… This is for everyone, Congress, BJP, all CMs and the PM, HM and everyone who is supporting Avimukteshwaranand… The Congress party is giving complete support to Avimukteshwaranand… When our Guruji became 'Brahmleen',… pic.twitter.com/w0ebQ086gN
— ANI (@ANI) July 21, 2024
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?