NTV Telugu Site icon

Govindananda Saraswati: “అవిముక్తేశ్వరానంద ఫేక్ బాబా”.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆటలాడుతోంది..

Govindananda Saraswati

Govindananda Saraswati

Govindananda Saraswati: స్వామి అవిముక్తేశ్వరానంద ఒక నకిలీ బాబా అంటూ స్వామీ శ్రీ గోవిందానంద సరస్వతి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఈ రోజుల్లో ముక్తేశ్వరానంద అనే నకిలీ బాబా పాపులర్ అవుతున్నాడు. ప్రధాని మోడీ పాదాలను తాకుతున్నాడు, అంబానీ లాంటి బడా వ్యాపారవేత్త ఇంటికి స్వాగతిస్తున్నాడు. టీవలో కొందరు ఆయనను ‘శంకరాచార్య’ అనే ట్యాగ్ ఇస్తున్నారు. ముక్తేశ్వరానంద్ నకిలీ బాబా, అతను తన పేరకు సాధు, సంత్ లేదా సన్యాసి జోడించుకునే అర్హత లేదని దేశ ప్రజలకు నేను సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఇక శంకరాచార్య గురించి మరిచిపోండి’’ అంటూ స్వామి శ్రీ గోవిందానంద సరస్వతి మహారాజ్ అన్నారు.

ముక్తేశ్వరానందపై ఉన్న వారణాసి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ని గోవిందానంద చూపించారు. అతను పరారీలో ఉన్నాడని, మేము ఇవన్నీ సుప్రీంకోర్టుకు చెప్పాలని అనుకుంటున్నామని, కానీ వారు తమకు తదుపరి తేదీలు ఇస్తున్నారని, మాకు న్యాయం కావాలని, అతను దేశానికి హానికరమని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ఈ పత్రాలన్నింటిని ముందుకు తెస్తున్నామని, అవిముక్తేశ్వరానంద ప్రజలను చంపడం, కిడ్నాప్ చేయడం, శ్రీరాముడి ప్రాణప్రతిష్టను ప్రశ్నించడం, అతను సన్యాసిగా నటిస్తూ వివాహాలకు హాజరవుతున్నాడని, అతను కేదార్‌నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం మాయమైందని చెబుతున్నారు, అతనికి బంగారం ఇత్తడికి తేడా తెలుసా..? అంటూ గోవిందానంద ధ్వజమెత్తారు. అవిముక్తేశ్వరానంద్ రాహుల్ గాంధీతో కలిసి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆటలాడుతోందని అన్నారు.

Read Also: Internet Shutdown: 24 గంటల పాటు ఇంటర్నెట్ బంద్..సోషల్ మీడియా యూజర్లకు హెచ్చరిక..

అవిముక్తేశ్వరానంద్‌కి కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని గోవిందానంద ఆరోపించారు. ప్రియాంకాగాంధీ సెప్టెంబర్ 12, 2022న అతడిని శంకరాచార్యగా సంబోధిస్తూ లేఖ రాశారని సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ అవిముక్తేశ్వరానంద్‌ని శంకరాచార్య అని సంబోధిస్తూ ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ ఎందుకు లేఖ రాశారు..? అని ప్రశ్నించారు. శంకరాచార్య అనేది కాంగ్రెస్ నిర్ణయింస్తుందా.? అని అడిగారు. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నిలబడిన ఆయనకు ఎవరు మద్దతు ఇస్తున్నారు..? అని ప్రశ్నించారు. గేమ్‌లో అవిముక్తేశ్వరానంద్ ఒక బొమ్మ అని అన్నారు. ప్రియాంకాగాంధీ లేఖ రాసినందున క్షమాపణలు చెప్పాలని, లేకుంటే సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తామన్నారు.

అక్టోబర్ 2022లో, ఉత్తరాఖండ్ జ్యోతిర్ పీఠానికి కొత్త శంకరాచార్యగా అవిముక్తేశ్వరానంద సరస్వతి పట్టాభిషేకాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. జ్యోతిష్ పీఠం కొత్త శంకరాచార్యగా అవిముక్తేశ్వరానంద నియామకాన్ని ఆమోదించలేదని పూరీలోని గోవర్ధన్ మఠానికి చెందిన శంకరాచార్య అఫిడవిట్ దాఖలు చేశారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జ్యోతిర్ పీఠాధిపతిగా తనను స్వామి స్వరూపానంద సరస్వతి వారసుడిగా ప్రకటించినట్లు అవిముక్తేశ్వరానంద సరస్వతి తప్పుడు క్లెమయ్ చేసినట్లు ఆరోపిస్తూ, సుప్రీంలో కేసు ఫైల్ అయింది.

ఇటీవల అవిముక్తేశ్వరానంద అంబానీ వివాహ వేడుకల్లో కనిపించాడు. ఆ సమయంలో ప్రధాని మోడీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీకి వెళ్లి ఆయనను కలిశారు. ఆ సమయంలో ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమయ్యాయి. సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉద్దవ్ ఠాక్రేకి వెన్నుపోటు పొడిచాడని అన్నారు. ప్రజలు దీంతో వేదనకు గురవుతున్నారని, ఈ లోక్‌సభ ఎన్నికల్లో దీని ప్రభావం కనిపించిందని, పార్టీని చీల్చి ఠాక్రేకి ద్రోహం చేశారని అన్నారు. మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా ప్రజల బాధ తీరదని వ్యాఖ్యానించారు. హిందూ ధర్మంలో ద్రోహం అతిపెద్ద పాపం అని, ద్రోహం చేసే వాడు హిందువు కాదని వ్యాఖ్యానించారు.