NTV Telugu Site icon

Mukesh Ambani: అస్సాం వరద బాధితుల కోసం భారీ విరాళం

Assam Floods

Assam Floods

అస్సాం రాష్ట్రం వరద విలయంలో చిక్కుకుంది. గత కొన్ని రోజలు నుంచి భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్రంలోని మొత్తం 35 జిల్లాల్లో 30 జిల్లాలు వర్షాలు, వరదల తాకిడికి గురయ్యాయి. దాదాపుగా 46 లక్షల మంది ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. ఇప్పటి వరకు వరదల కారణంగా 118 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లోనే 10 మంది వరదల కారణంగా మరణించారు. బ్రహ్మపుత్ర, బరాక్ నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.

వరదలతో విలవిల్లాడుతున్న అస్సాంకు దాతలు బాసటగా నిలుస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, అతని కొడుకు అనంత్ అంబానీ అస్సాం ముఖ్యమంత్రి సహాయనిధికి ( సీఎంఆర్ఎఫ్) రూ. 25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి  పెద్ద మనసును చాటుకున్నాడు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీలకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా, తన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ నుంచి రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. ఆయిల్ ఇండియా లిమిటెట్(ఓఐఎల్) రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చింది. టీ సిరీస్ ఓనర్, మ్యూజిక్ ప్రొడ్యూసన్ రూ. 11 లక్షలు విరాళంగా అందిచగా.. ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ రూ.5 లక్షలు, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ రూ. 5 లక్షలు, బాలీవుడ్ ప్రొడ్యూసన రోహిత్ శెట్టి రూ. 5 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు వరద బాధితుల కోసం విరాళం అందించారు.