ప్రధాని మోడీ బుధవారం 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖులంతా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గర నుంచి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వరకు.. ఇలా నాయకులంతా శుభాకాంక్షలు చెప్పారు.
ఇది కూడా చదవండి: Narendra Modi : ప్రధానికి.. మహేశ్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు – స్పెషల్ వీడియో
తాజాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.. ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. వీడియోలో మోడీని ‘‘అవతార పురుషుడు’’గా అభివర్ణించారు. భారతదేశం 100 ఏళ్లు నిండేదాకా మోడీ భారతదేశానికి సేవ చేయడం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఇది తన ప్రగాఢ కోరిక అని ముఖేష్ అంబానీ తెలిపారు.
ఇది కూడా చదవండి: US-Israel: ఖతార్‌లో దాడి విషయం అమెరికాకు ముందే తెలుసా! వెలుగులోకి కీలక రిపోర్ట్!
ప్రధాని మోడీ భారతదేశాన్ని ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదిగేందుకు ఎంతో కృషి చేశారన్నారు. దశాబ్దాల అంకితభావం, పరివర్తనాత్మక నాయకత్వం, దార్శనికతే కారణం అని ముఖేష్ ప్రశంసించారు. ఈరోజు 1.45 బిలియన్ భారతీయులకు ఇదొక వేడుక అని చెప్పారు. భారతీయులందరికీ ఈరోజు పండుగ రోజే అన్నారు. ఎందుకంటే మన మాతృభూమిని గొప్ప దేశంగా మార్చడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు మోడీని అవతార పురుషుడిగా పంపించారని పేర్కొన్నారు.
భారతదేశం అభివృద్ధి కోసం మోడీ అవిశ్రాంత కృషి చేస్తున్నారని ప్రశంసించారు. దేశం కోసం ఇలా పని చేసే నాయకుడిని ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడలేదన్నారు. మొదట గుజరాత్‌ను ఆర్థిక శక్తిగా మార్చారు. ఇప్పుడు దేశ మొత్తాన్ని ప్రపంచ సూపర్ పవర్‌గా మార్చేందుకు కంకణం కట్టుకున్నారని తెలిపారు.
Indian businessman @_MukeshAmbani extends heartfelt wishes to PM Narendra Modi on his 75th birthday on behalf of the Reliance Group, Ambani family, and the Indian business community, praising his decades-long dedication, transformation of Gujarat, and vision to make India a… pic.twitter.com/btuKIF7cVK
— DD News (@DDNewslive) September 17, 2025
