NTV Telugu Site icon

Assam: అస్సాంకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు.. అంబానీ, అదానీ పోటీపడి మరీ ఇన్వెస్ట్‌మెంట్..

Assam

Assam

Assam: అస్సాంకు పెట్టుబడుల వరద పారింది. గౌహతిలో జరిగిన అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్‌లో వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దేశంలో దిగ్గజ పారిశ్రామికవేత్తలుగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ అస్సాంలో ఒక్కొక్కరు రూ. 50,000 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించారు. ఇద్దరు కలిసి రూ. 1 లక్ష కోట్లను అస్సాంలో పెట్టుబడిగా పెట్టనున్నారు.

Read Also: Maha Shivaratri 2025: మహాశివరాత్రి నాడు జాగరణ, ఉపవాసం ఎలాంటి వారు చేయకూడదు?

మంగళవారం జరిగిన సదస్సులో అదానీ మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రంలో రూ. 50,000 కోట్ల పెట్టుబడులను పెట్టబోతున్నట్లు చెప్పారు. ఇండియా ఆర్థిక వృద్ధిలో పెట్టుబడిదారుల శిఖరాగ్ర సమావేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ముఖేష్ అంబానీ కూడా రానున్న 5 ఏళ్లలో అస్సాంలో 50,000 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పారు. రాష్ట్రంలో యువత సాంకేతిక, ఇతర రంగాల్లో పురోగమిస్తున్నందున, AI – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో ‘అస్సాం ఇంటెలిజెన్స్’కు నిలయంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ సమ్మి్‌ట్‌కి దేశంలోని అగ్రగామి పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకారం.. రాష్ట్ర మంత్రి వర్గం ఆదివారం రోజు రూ. 1.22 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనల్ని ఆమోదించింది. ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని మోడీ సోమవారం గౌహతి చేరుకుని, టీ తెగకు చెందిన దాదాపు 9000 మంది కళాకారులు పాల్గొన్న ‘‘ఝుముర్’’ డ్యాన్స్ ప్రదర్శనకు హాజరయ్యారు.