నేటి కాలంలో కొందరు వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నారు. వ్యామోహమో.. లేదంటే విలాసాల కోసమో.. ఇంకా లేదంటే పడక సుఖం కోసమో తెలియదుగానీ అడ్డదారులు తొక్కుతున్నారు. కలకాలం కలిసుండాల్సిన వైవాహిక బంధం.. మధ్యలోనే కూల్చుకుంటున్నారు. తాజాగా ఓ ఇద్దరు పిల్లల తల్లి.. తనకంటే చిన్న వయసు ఉన్న కుర్రాడితో లేచిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 6 నెలలు సహజీవనం చేసిన తర్వాత సీన్ రివర్స్ అయింది. అసలేమైంది? 6 నెలల తర్వాత ఎందుకు బెడిసికొట్టిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Gaza-Israel: గాజాలో మళ్లీ టెన్షన్ వాతావరణం.. తాజా దాడుల్లో 26 మంది మృతి
ఢిల్లీకి చెందిన పూజా మిశ్రా, లలిత్ కుమార్ మిశ్రా భార్యాభర్తలు. వీరికి ఏడు, ఆరు సంవత్సరాల వయసు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. సంసారం సాఫీగా సాగిపోతున్న సమయంలో పూజా మిశ్రా అడ్డదారులు తొక్కింది. ఇంట్లో సహాయంగా ఉన్న లలిత్ కుమార్ మిశ్రా మేనల్లుడైన అలోక్ మిశ్రాతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండానే మేనల్లుడితో ఎఫైర్ సాగిస్తోంది. విచిత్రమేంటంటే.. అలోక్ మిశ్రా.. పూజా మిశ్రా కంటే 15 సంవత్సరాలు చిన్నవాడు. అయినా కూడా అతడితో వివాహేర సంబంధాన్ని కొనసాగిస్తోంది. అయితే పూజా-అలోక్ ఒక రోజు ఏకాంతంగా ఉన్నప్పుడు లలిత్ కుమార్ మిశ్రా చూసేశాడు. దీంతో అలోక్ మిశ్రాను బరేలీకి పంపేశాడు.
ఇది కూడా చదవండి: Bihar Elections: మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. విడివిడిగానే విపక్షాలు పోటీ
అయితే పూజా మిశ్రా.. అలోక్ మిశ్రాను విడిచిపెట్టి ఉండలేకపోవడంతో భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలేసి బరేలీ వెళ్లి అలోక్ మిశ్రాతో సహజీవనం చేస్తోంది. ఇలా ఆరు నెలలు బాగానే కలిసి జీవించారు. ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ ఇద్దరు మధ్య విభేదాలు తలెత్తాయి. ఘర్షణ తీవ్ర కావడంతో సొంత గ్రామం సీతాపూర్‌లో పెద్దలు పంచాయితీ పెట్టారు. అయితే ఇక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరికి పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇకపై పూజాతో ఉండేది లేదంటూ అలోక్ మిశ్రా పోలీసుల ముందు తేల్చిచెప్పేశాడు. ఈ పరిణామంతో షాకైన పూజా మిశ్రా బ్లేడ్‌తో మణికట్టును కోసేసుకుంది. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తం అయి చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉండడంతో లోక్నోకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
